The Big Mess show!

 

మన టీవీ ఛానెల్‌ రేటింగు,
 పాపులారిటీ అమాంతం పెరిగిపోవాలంటే 
ఏం జెయ్యాలో సెప్పు సెగట్రీ?

దానికి నా దగ్గిరో మంచి ఐడియా ఉంది సార్‌! 

25-35 మధ్య వయసున్న ఒక ఇరవై మందిని,
సినిమా వాళ్ళనుండి, 
సినిమా పాటలు పాడే వాళ్ళనుండి,
యాంకర్ల నుండి,
వాళ్ళతోబాటు ఒకరిద్దరు సామాన్యులనీ తీస్కొచ్చి 
అందర్నీ ఒక ఇంట్లో పడేసి ఒక్క బాత్రూంలో తప్ప 
ఇల్లంతా కెమెరాలు పెడ్తాం. 

ఆర్టిస్టులు ఎందుకు? 

వాళ్ళకి లాజిక్‌ కన్నా ఎమోషన్స్ ఎక్కువుంటాయ్‌ సార్‌!

 వాళ్ళైతే మన షో లో బాగా డ్రామా క్రియేట్‌ చేయగల్రు. 

మామూలు వాళ్ళెందుకు మధ్యలో?

వాళ్ళను చూసి మాకూ ఎప్పుడో అవకాశం వస్తుంది అని చూసేవాళ్ళు అనుకుంటారు సార్‌!

ఆ తర్వాత? 

ఆ తర్వాతేముంది సార్‌?

 వాళ్ళు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా 
ఆ కొంపలో రెండు నెలలు ఉండాలి. 

ఇంక చేసేది లేక, 
కొట్టుకుంటారు, 
తిట్టుకుంటారు, 
నవ్వుకుంటారు, 
ఏడ్చుకుంటారు.

కాలు తగిలిందని, 
చెయ్యి తగిలిందని 
తగాదాలు పడతారు. 

గ్రూపులుగా విడిపోయి సిగపట్లు పడతారు సార్‌!

అదంతా మన కెమెరాలు 24 గంటలు capture చేసి ప్రసారం చేస్తూనే ఉంటాయి.

ఇవన్నీ ఎవడు చూస్తాడయ్యా?

మీకు తెలీదు సార్‌! 

ప్రపంచంలో అందరికీ పక్కోడి జీవితంలో ఏం జరుగుతోందో అనే ఇంట్రెస్టు. 

పక్కింట్లో తగాదాలు, ఎదురింట్లో ఎఫైర్లు అందరికీ కావాలి.
వాటికోసం జీవితాలు ధార పోస్తారు సార్‌! 

ఇలాంటి షోలు వేరేచోట్ల సూపర్‌ హిట్‌ అయినాయి సార్‌! 

వార్నీ? అవునా? ఇంకా చెప్పు.

ఇంకా ఇందులో ఏ తగాదాలూ పెట్టుకోకుండా మెత్తమెత్తగా అన్నింటికీ సర్దుకుపోతూ ఉండేవాళ్ళు ఉంటారు సార్‌!

వాళ్ళని కూడా మనం active participation లోకి లాగాలంటే, 
మనం వాళ్ళకి కొన్ని టాస్కులు ఇవ్వాలి,
 కొన్ని games ఆడించాలి.

ఎలాంటి టాస్కులు? 

వాళ్ళని టీమ్స్ గా విడగొట్టి ఒక్కో టీం కి ఒక్కో పని ఇవ్వాలి. 

ఒక టీం వంట చేస్తుంది. 
ఒక టీం గిన్నెలు తోముతుంది.
అక్కడ బోల్డన్ని తగాదాలు వస్తాయి. 

అసలు అత్తాకోడళ్ళ వంటింటి రాజకీయాల్తోనే 
కొన్ని వేల కాపురాలు ఢామ్మన్నాయి సార్‌! 

అంత పవర్‌ఫుల్‌ సార్‌ వంటిల్లంటే. 
  
బాగా చెప్పావయ్యా. 
మా ఆవిడా మా అమ్మా పోటీలు పడి వంటల్లో ఉప్పూకారాలు రెండేసి సార్లు వేసి నా దుంప తెంపుతుంటే, మా అమ్మని వాళ్ళ పుట్టింటికీ, మా ఆవిడ్ని వాళ్ళ పుట్టింటికీ పంపేసి ఇప్పుడు హాయిగా ఉన్నా.

ఇంకా చెప్పు మన షో గురించి?

ఇంకా వంటింటి రేషన్‌ పెడతాం సార్‌! 

ఒక బ్రెడ్‌ పాకెట్‌,
 రెండు కేజీల బియ్యం,
అర చెంచా ఉప్పు, 
మిల్లి గరిటెడు కారం,
 గుప్పెడు కూరగాయలు, 
ఇరవై మందికి వారం రోజులు సద్దాలి.

అక్కడే వాళ్ళకి డిష్యుం డిష్యుం బోల్డు తగాదాలై 
మన ఛానల్‌ రేటింగ్‌ అమాంతం పెరిగి పోతుంది సార్‌! 

మరి గేమ్సు?

ఒక రోజు ముక్కుతో బొమ్మలు గీయాలి, 
ఒక రోజు కేజీ ఉల్లిపాయలు తినాలి, 
ఒక రోజు నూనె పట్టించిన స్తంభం పైకి ఎగబాకాలి,
ఒక రోజు పాములుంచిన పెట్టెలోంచి కాడ్బరీస్‌ చాక్లెట్‌ తియ్యాలి.

ఇలా చాలా క్రియేటివ్‌ గేమ్స్ ఆడిస్తాం సార్‌! 

అంతే కాదు సార్‌, 
ఒకే ఇంట్లో పడి ఉండడం చేత 
మన ఆడ,మగ participants కి intimacy పెరిగి దగ్గరవడం,
 అదిఇదీ,
కొంత జింతాతా జితాజితాలన్నీ 
మన షో కి చాలా ఫెచింగ్‌ అవుతాయి సార్‌! 
 

సూపర్‌ సెగెట్రీ! మరి సెలెక్షన్స్ మొదలెడదాం పట్టు.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన