హవ్వ! లిపి ఎరుగని మూఢులమట! - 1

 


మహామహులతో సభ జరుగుతోంది.

 సభికుల్లో చాలామంది మెకాలే మానస పుత్రులుగాను,
 బ్రిటీషు వాడి బాబాయి కొడుకులుగాను ఉన్నారు. 

వెనుక వరుసలో ఒక వేద పండితుడు, ఆయన పక్కన తెలివైన తెలుగువాడు కూర్చుని ఉన్నారు. 

మహామహుల్లో ఒక మహామహుడు తన ప్రసంగం మొదలెట్టేడు. 

“మనకి వ్రాత తెలియదు. దర్షియా వాళ్ళు వాళ్ళు గాడిదల మీద వచ్చి మనకు నేర్పించారు”

అలా అంటాడేమిటండీ, 
వేదాలలో అక్షర,కాండ,పటల, గ్రంథ అన్న పదాలున్నవి కదా?

ఐతరేయ బ్రాహ్మణంలోను, శ్రౌత సూత్రాలలోను “పటలం” అని గ్రంథ భాగాన్ని తెలిపే పదం (Chapter) అనేకమార్లు వస్తుంది. 

అన్నాడు వేద పండితుడు పక్కనున్న తెలివైన తెలుగువాడితో.

ఆ ఆధారాలేవీ పనికి రావని పెడవాదం చేస్తున్నాడండీ అన్నాడు తెలివైన తెలుగు వాడు.

“మనకు మొదట లిపి లేదు. తర్వాతెప్పుడో వచ్చింది. మనదంతా మౌఖికమే” 

ఉతత్వః పశ్యన్ నదదర్శ వాచం ఉతత్వః శృణ్వన్ నశృణేత్యేవామ్ 
(10-071-04)

కొందరు వేద వాక్కును చూచీ చూడరు, కొందరు వినీ వినరు అని ఋగ్వేదంలో లిపి ప్రశంస ఉంది కదయ్యా! చూచీ చూడరు అంటే, వ్రాసి ఉంది చూసీ చూడరు అనే కదా అర్థం అన్నాడు వేద పండితుడు.

ఆ ఆధారాలేవీ పనికి రావని పిడివాదం చేస్తున్నాడండీ అన్నాడు తెలివైన తెలుగు వాడు.

సప్త ఛందస్సులు- గాయత్రీ ఛందస్సుకు ఎనిమిది అక్షరాలు ఉండాలి,త్రిష్టుప్‌ ఛందస్సుకు పదకొండు అక్షరాలు,జగతీ ఛందస్సుకు పన్నెండు అక్షరాలు, ఇలా ఇన్ని అక్షరాలైతే ఛందస్సు పాదమని,ఇన్ని పాదాలైతే ఛందస్సని అంటారని,

గాయత్రేణ ప్రతి మిమీతే అర్కమ్ అర్కేణ సామ త్రైష్టుభేన వాకమ్ |
వాకేన వాకం ద్విపదా చతుష్పదాక్షరేణ మిమతే సప్త వాణీః || 
(1-164-24)

అన్న ఋక్కు చెబుతోంది కదయ్యా! అన్నాడు వేద పండితుడు.

అదంతా ధ్వని గురించేగానీ లిపి అప్పటికి పుట్టలేదని, ఆ తరువాతెప్పుడో బయట వాళ్ళెవరో వచ్చి నేర్పారని ఎడమ వాదం చేస్తున్నాడండీ అన్నాడు తెలివైన తెలుగు వాడు. 

శుక్ల యజుర్వేద సంహిత అయిన వాసజనేయ సంహితలో,

అక్షరశ్ఛందః పదపంక్తిశ్ఛందః విష్ఠార పంక్తిశ్ఛందః క్షురోభ్రజః ఛందః

నాశరహితమైనవి అక్షరాలు. వాటి పంక్తి అక్షర పంక్తి. క్షురమంటే తవ్వేది,గోకేది అనే అర్థాలున్నవి. 
క్షుర భ్రజ అంటే వ్రాతతో ప్రకాశించేది అని స్పష్టంగా ఉంది కదయ్యా! అన్నాడు వేద పండితుడు కించిత్‌ అసహనంగా.  

“ఆశోకుడి ముందు కాలం వరకు ఎటువంటి రాత ఆనవాళ్ళు దొరకలేదు కాబట్టి మనకు మనదైన లిపి లేదు. మనదంతా నోటి మాటలు,నోటి లెక్కలు,మౌఖిక విద్య. దర్షియన్‌‌ వాళ్ళు,వాళ్ళు మనకి రాయడం నేర్పారు.”

వేదాల్లో చెప్పబడిన క్లిష్టమైన వ్యాకరణ సూత్రాలు, కాలాన్ని గురించి, తూనికల గురించి చెప్పబడిన పెద్ద పెద్ద సంఖ్యలు, గణనలు లిపి లేకుండా, పోనీ కనీసం ఏవో కొండ గుర్తులైనా రాసుకోకుండా సాధ్యమౌతుందా? 

ఏమిటో ఈ మేధావి పిడివాదం. 
నా బొందలాగా ఉంది. 
సరే చూద్దాం, ఇంకా ఏమి చెబుతాడో అన్నాడు వేద పండితుడు ఆ ప్రసంగాన్ని మరింత శ్రద్ధగా వింటూ.



(సశేషం)

సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ 🚩


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన