ఇదేమిటబ్బా? ఇది అదేను అబ్బా! -1

 


మేము స్త్రీల కోసం పోరాటం చేసే వాళ్ళం.


ఓహో, అలాగా. చాలా సంతోషమండీ.
 పాపం, ఆడవారి కష్టాలు తీర్చడం కోసం పని చేసేవారన్న మాట. 
అంటే, వారి కాపురంలో కలతలు అవీ ఉంటే కూర్చోబెట్టి మాట్లాడి రాజీ కుదురుస్తారాండీ? 

అవన్నీ చేయడానికి మేమేమన్నా వాళ్ళ ఇంటి పెద్దలమా లేక కుల పెద్దలమా?  మేం స్త్రీలను చైతన్యపరుస్తాం! 

ఓహో, అంటే వాళ్ళని చదువుకోమని, ఉద్యోగాలు చేయమని ప్రోత్సహిస్తారా? 

అవును, చైతన్యం పొందిన స్త్రీ చదువుకుంటుంది, తన కాళ్ళ మీద తాను నిలబడుతుంది.

చాలా మంచి పని చేస్తున్నారు. చదువున్న గృహిణి కుటుంబాన్ని దిద్దుకుంటుంది. ఉద్యోగం చేస్తే కుటుంబానికి ఆలంబనగా ఉంటుంది.

మేం స్త్రీలను చైతన్యపరిచేది మళ్ళీ ఆ కాపురమే దిద్దుకుని, జీతమంతా భర్తకి, కుటుంబానికి ఖర్చు పెడుతూ బానిసలా పడి ఉండమని కాదు. 

మరి?

చైతన్యం పొందిన స్త్రీ బానిసలా పడి ఉండదు. 
తన విలువ తెలుసుకుంటుంది. 
తాను పిల్లల్ని కనే యంత్రం కాదని తెల్సుకుంటుంది. 

పిల్లల్ని ఆడవారే కనాలేమో కదండీ? 

అవును, ప్రకృతి స్త్రీకి అన్యాయం చేసింది. 
ఆ పిల్లలను పెంచే భారం సమాజం తల్లుల నెత్తినే పడేసింది. 

తన పిల్లలను తనే పెంచుకోవాలని ప్రతి తల్లీ అనుకుంటుంది కదండీ? 
ఏమిటో నాకంతా అయోమయంగా ఉంది.

అవును, స్త్రీలో  చైతన్యం రానంత వరకూ అలాగే ఉంటుంది. 

అసలు స్త్రీకి పెళ్ళే పెద్ద కుట్ర. 

చైతన్యం పొందిన స్త్రీ ఈ కుట్రని అర్థం చేసుకుని ఆ సాలెగూటిలోంచి బయటకు వస్తుంది.

ఓ! కుటుంబాన్ని వదిలేసి బయటకు వస్తుందన్నమాట! తర్వాత? 

అవును. చైతన్యం పొందిన స్త్రీ  స్వేచ్ఛ వైపు ముందు అడుగులు వేస్తుంది. తరువాత పరుగులు పెడుతుంది. 

అన్ని బంధాలను ఛట్‌ పట్‌మని తెంచుకుని ఉద్యమకారిణి అవుతుంది. 

తర్వాత?

తరువాత ఇతర స్త్రీలను చైతన్యపరచి వాళ్ళ ఉక్కు సంకెళ్ళను ఛట్‌ పట్‌మని తెంచి ఉద్యమం వైపుకి నడిపిస్తుంది.

ఓ! తనలాంటి మరింత మంది స్త్రీలు! 

సరేనండీ, ఈ ఉద్యమం అయ్యాక ఆవిడకి శాంతి దొరుకుతుందా? కష్టాల నుండి విముక్తి పొందుతుందా?

ఉద్యమంలోకి రావడమే విముక్తి అని పూర్తిగా ఆమె మెదడుని లోబరచుకుంటాం. 

ఇక తనలాంటి ఇతర స్త్రీలను తయారు చేస్తూ పోవడమే ఆమె పని.

ఓ! ఈ స్త్రీలంతా ఏం చేస్తారండీ?

మనం నూరిపోసిన భావజాలం కోసం కలం పడతారు, కత్తి పడతారు, తుపాకీ పడతారు. మనం పడమంటే బస్సు కింద, లారీ కింద కూడా పడతారు. 

అయ్యయ్యో! అదేమిటండీ అలా అంటున్నారు?

వారిప్పుడు నేను నూరిపోసిన భావజాలాన్ని బుర్రలనిండా నింపుకుని నేను ఏం చెయ్యమంటే అది చేసి పెట్టే బానిసలు! 

హహ్హహ్హ! Iam the leader! Iam the dictator! 


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన