తాతాచారికి తెలుగుణ పాఠం!

 


తాతాచారి బేవార్స్ గా అలా రోట్లెమ్మట తిరిగి వచ్చి, 
తన గర్ల్ ఫ్రెండ్‌ బుచ్చమ్మ చేసిన ఇడ్లీ, పల్లీ పచ్చడి తిని, 
ఖాళీగా కూచుని, తన అనువాద పుస్తకాలు, 
తన బీభత్స అవార్డు చూసుకుని చూసుకుని మురిసిపోసాగాడు.

ఇంతలో అక్కడ విశ్వనాథ, గురజాడ దుడ్డుకర్రలతో, 
గుడ్లెర్ర జేస్తూ ప్రత్యక్షమైనారు.

హిహ్హిహ్హి! మీరా! రండి! రండి! హిహ్హీ! 
అంటూ వాళ్ళని ఆహ్వానించాడు తాతాచారి.

ఏం తాతా, “కన్యాశుల్కము” కు ఆంగ్ల అనువాదం ఏమిటి? చెప్పు?
శుల్కము అంటే Sale??
 అని అరిచాడు గురజాడ.

హిహ్హీ, అంతే! అంతే! అన్నాడు తాతాచారి నంగిరిగా.

కన్యలను పెళ్ళాడడానికి వరుడు ఇచ్చే శుల్కాన్ని పట్టుకుని
 “అమ్మకానికి అమ్మాయిలు” అని అనువదించాడా ఈ అప్రాచ్యుడు!
 అని అరిచాడు విశ్వనాథ.

దాన్ని నా అంధ భక్తులు ఎంతో మెచ్చుకున్నారు, హీహీ!
అన్నాడు తాతాచారి పరవశిస్తూ.

నా కన్యాశుల్కంలో “ఒక్క బిగిని లెక్చర్‌ ఇచ్చేసరికి ప్రొఫెసర్లంతా డంగైనారు” అన్న వాక్యానికి ఈ తాతాగాడి బుర్ర తక్కువ వెర్రి పుచ్చకాయ 
అనువాదం చూడండి - “ when Girisam gave non-stop lecture for full hour all professors in the town turned into Dung!” ట!

హవ్వ! సిగ్గుమాలిన భాషాఖూనీకోర్‌! 
నువ్వు తెలుగు భాషలో ఆచార్యుడివి కూడానా? 

నేనడిగానా నా కన్యాశుల్కాన్ని అనువదించమని?

తెలుగు రాదు, ఆంగ్లమూ రాని పులుముడు పిల్లీ!
 అని గురజాడ దుడ్డు కర్రతో ఒక్కటి వెయ్యగానే 
తాతాచారి కుయ్యో మొర్రోమన్నాడు.

వెంటనే తేరుకుని, 
నన్ను దేవుడిగా కొల్చే నా శిష్యులే నాకు బలం, హీహీ! అన్నాడు నిస్సిగ్గుగా.


“చెలియలి కట్ట” కు ఆంగ్లానువాదం ఏమిటిరా త్రాష్టుడా? 
అని కోపంగా కళ్ళెర్రజేసాడు విశ్వనాథ.

హిహ్హీ! అని మళ్ళీ నంగిరిగా నవ్వాడు తాతాచారి.

ఏమని అనువదించాడండీ? అని ఆసక్తిగా అడిగాడు గురజాడ.

ఒడ్డు సముద్రుడికి చెల్లెలుట! 
అది చెల్లెలి కట్ట అంటే “Sister’s Limit” అన్నాడు వీడి సొంత పైత్యం కొంత కలిపి.

హిహ్హీ! నా శిష్యులున్నంత వరకూ నన్నెవరూ ఏమీ చెయ్యలేరు. 
హిహ్హీ! అన్నాడు తాతాచారి నిస్సంకోచంగా.

ఈ నిస్సిగ్గుతనానికి ఒళ్ళు మండిన 
విశ్వనాథ, గురజాడ దుడ్డుకర్రలతో 
తాతాచారికి పృష్ట తాడనం చేయగానే, 
తాతాచారి ఎగ్గిరి బుడమేట్లో పడ్డాడు! 

ఆ వెనకే నడుం విరిగిందిరా దేవుడోయ్‌! 
అన్న తాతాచారి కేక విని, 
ఆ పక్కన్నే గలగలా పారుతున్న కృష్ణమ్మ 
ఒక్క క్షణం ఆగి కిలకిలకిలా నవ్వింది! 


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

పద్యం కట్టిన వాడే పోటుగాడు

The side effects of సౌందర్య దృష్టి