పరోపదేశ వేళాయాం సర్వే వ్యాస పరాశరాః

 


జీవితమంటే పోరాటం. ఊ…ఇంటా బయటా ఎంతోమంది శత్రువులుంటారు. వారిని ఎదుర్కోవాలి. ఎన్నో కష్టాలు ఎదురౌతాయి. 
 ధైర్యంగా నిలబడాలి.తెలిసిందా?

అలాగే ఎదుర్కుంటా సార్‌!

 కానీ జీవితమంటే పోరాటాలు,కష్టాలేనా సార్‌!? 

హేపీగా జాలీగా ఎంజాయ్‌ చెయ్‌డం ఏమీ ఉండదా సార్‌?

ఉంటుంది. 

కానీ, అలా ఎంజాయ్‌ చేస్తున్నంత సేపూ ఇది శాశ్వతం కాదు, ఇది క్షణికం, ఇది క్షణికం అనుకుంటూ ఉండాలి. తెలిసిందా?

సరే సార్‌! 
ఎంజాయ్‌ చేస్తున్నంతసేపూ ఇది క్షణికం,ఇది క్షణికం అనుకుంటూ ఉంటా. 

Very good. దాన్నే ఎఱుక అంటారు.

కష్టాల్లో ఉన్నప్పుడు ఏడవరాదు. 
సుఖాల్లో ఉన్నప్పుడు నవ్వరాదు. 

సరే సార్‌! 

కష్టాల్లో ఉన్నప్పుడు నవ్వుతా. 
సుఖాల్లో ఉన్నప్పుడు ఏడుస్తా. 

Wonderful ! నీకు వేదాంతం బాగా వంటబడుతోంది. 

కానీ చుట్టూ జనం నన్ను చూసి పిచ్చివాడనుకుంటారేమో సార్‌!

 ఒక పని చేస్తా సార్‌, కష్టమొచ్చినా, సుఖమొచ్చినా 
మొహంలో ఏ భావము ప్రకటించకుండా నీలుక్కుని కూచుంటా.

Super! అలా చెయ్యి. 

దాన్నే స్థిత ప్రజ్ఞత అంటారు. 

కోపమొచ్చినా,
 ఏడుపొచ్చినా,
నవ్వు వచ్చినా 
అంతా మొత్తం లోపలికి మింగి వేయడమే యోగి లక్షణం. 
తెలిసిందా? 

తెలిసింది సార్‌! 

ఇప్పుడే అన్నీ మింగేశా సార్‌! లోపల చానా ప్రశాంతంగా ఉంది సార్‌!

యోగినై పోయిన ఫీలింగ్‌ వస్తోంది సార్‌! 


Super! Fantastic! 

నా టీచింగ్స్ మీకు బాగా పనిచేస్తున్నాయి. 

Keep it up! 


ఇంతకీ ఈమధ్య మీకు వ్యాపారంలో నష్టం వచ్చిందని విన్నాను. నిజమేనా సార్‌?

అదంతా నీకు అనవసరం.

అవినీతి కేసులో ఇరుక్కున్నారని..

నోర్ముయ్‌! ఎవరు చెప్పారు నీకు?

అంటే పేపర్లో చదివా సార్‌!

షటాప్‌ అండ్‌ గెటౌట్‌ ఆఫ్‌ మై మదర్‌లాండ్‌! 

ఏంటి సార్‌, ఒక్క ప్రశ్నకే కాలర్‌ పట్టుకుని మీరిలా..

షటాప్‌!షటాప్‌!షటాప్‌!

గెట్‌ లాస్ట్! 


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన