తెలంగీ - బేడంగీ

 

నేను తిరగా భాష నేర్చుకుని ఆ సాహిత్యాన్ని తెలుగులోకి, ఇంగ్లీషులోకి తెస్తా.

అమ్మా, ముందు నువ్వు తెలుగు బాగా నేర్చుకో తల్లీ! ఆ తిరగా భాష నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు. నీకెందుకమ్మా?

తిరగా భాష నేర్చుకుని, ఆ విప్లవం అంతా తెలుగులో పోస్తా.

అమ్మా, ఈ నేల మీద ఒకప్పుడు తెలుగు మాట్లాడితే నేరం. తెలుగు గొంతు నులిమారమ్మా. తెలుగు వాడు తెలుగు మరచి రాజ్య భాష నేర్చుకోవాల్సిన దౌర్భాగ్యంలో తరాలు గడిచాయమ్మా.

నేను తిరగా భాషే నేర్చుకుంటా. నాలాంటి వాళ్ళు ఎంతోమంది రావాలని ఎర్రక్క,ఎర్ర వదినెలు నన్ను ప్రోత్సహిస్తున్నారు.

అమ్మా, ఈ రాజ్యంలో తెలుగు దిక్కు లేనిది అన్నారమ్మా. ముక్కు మొహం లేని భాష అని ఎగతాళి చేసారమ్మా. 
తెలుగు తల్లిని చావు అంచుకు తీసుకెళ్ళిన పిశాచి రాజ్యంలో బతికామమ్మా మేమంతా. 
అమ్మా, అమ్మా, తెలుగు నేర్చుకో. ఆ భాష మనకెందుకమ్మా? 

కార్యాలయాల్లోను, దుకాణాల్లోను,బడిలోను, దవాఖానలోను తెలుగులు వంగి వంగి సలాములు కొడుతూ రుద్దబడిన భాషలో బతుకులు సాగించారమ్మా ఆనాడు. 
అమ్మా, అమ్మా, తెలుగు నేర్చుకోమ్మా. ఆ అన్య భాష నీకెందుకమ్మా.

ఇదంతా నాకు పట్టదు. నేను తిరగా భాషలో అనువాదాల గురించి ఎర్ర చీర కట్టుకుని progressive రచైతల సభకి పోతున్నా. 
నాలాంటి వాళ్ళు ఎంతోమంది రావాలని ఎర్రక్క,ఎర్ర వదినెలు నన్ను ప్రోత్సహిస్తున్నారు.

అమ్మా, అమ్మా, తెలుగమ్మా! 


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన