ఇదేమిటబ్బా? ఇది అదేను అబ్బా! - 2
మేం పీడితుల పక్షాన పోరాడతాం.
ఓ! చాలా సంతోషమండీ. అంటే అత్యాచార బాధితులు,హత్యాచార బాధితులు వీళ్ళ పక్షాన పోరాడతారన్న మాట.
ఆ బాధితులు మా వైపు సామాజిక వర్గాల వారైతేనే పోరాడతాం.
ఆ! మరి అవతలి పక్షం వారైతే?
మాకింక వేరే పని లేదనుకున్నావా?
ఆ విషయాన్ని అసలు చూడనట్టే పక్కన్నించి వెళ్ళిపోతాం.
ఓహో! Selective పోరాటాలన్న మాట.
బావుంది సార్! అయితే పోలీసులు దోషుల్ని పట్టుకోవాలని ఉద్యమిస్తారా సార్?
అవును. పిడికిళ్ళు బిగిస్తాం. ఉద్యమిస్తాం.
మరి, పోలీసులు వాళ్ళని పట్టుకుని,
చట్టం వారికి శిక్ష విధిస్తే ప్రభుత్వాన్ని అభినందిస్తారా సార్?
ప్రభుత్వాలని ఎట్టి పరిస్థితుల్లోనూ అభినందించరాదని మా పాలసీ.
ఆ నిందితులకు ఉరి శిక్ష పడితే యావజ్జీవంగా మార్చాలని,
యావజ్జీవం అయితే హాఫ్ యావజ్జీవం చెయ్యాలని
ఇలా ఈసారి నిందితుల తరఫున పోరాడతాం.
ఆ నిందితులకు కూడా తల్లులు, భార్యలు, చెల్లెళ్ళు ఉన్నారని కతలు కతలుగా రాసి ప్రచురించి ప్రచారం చేసి ఉద్యమాలు చేస్తాం.
ఆ! హత్యాచారాన్ని కేవలం చపాతీ చేసినంత చిన్న పనిగా జనాన్ని నమ్మిస్తారన్న మాట.
సరే సార్, మరి నిందితులు తీవ్రవాదులైతే?
తీవ్రవాదులని ముద్ర వేసి అమాయకులని పట్టుకున్నారని అంటాం.
మతం కోణం ఉందని, వేధింపులని,వివక్షలని, అంతర్జాతీయ వేదికల మీద అరిచి గొడవ చేస్తాం.
మేం పిడికిలెత్తమని పిలుపునిస్తే వేలాదిమంది వీథుల్లోకి వస్తారు. స్వేచ్ఛ కోసం, న్యాయం కోసం ప్రాణాలిస్తారు!
బావుంది సార్! మరి వాళ్ళల్లో కొందరికి మీరు చేసేవి అన్నీ నచ్చకపోవచ్చు కదా సార్?
మేం పిడికిలెత్తమన్న వాటికే పిడికిలెత్తాలి.
లేకపోతే,
రివిజనిస్టులు, డివిజనిస్టులు,
కోవర్టులు,డోవర్టులు,
బూర్జువాలు,జాంజిబార్లు
లాంటివెన్నో మా తిట్ల లిస్టులోంచి తీసి తిట్టి తిట్టి ఇంటికి పంపుతాం!
ఓ! ఎందుకు సార్, మీరు పైకి బాధితుల పక్షం అంటూ చివరికి నేరస్తుల పక్షాన పోరాటాలు చేస్తారు?
పిచ్చివాడా, నేరాలు చేసేవాళ్ళుంటేనే కదా మేం సీన్‌లోకి వచ్చి పోరాటం పేరు మీద ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చేది?
నేరాలు,ఘోరాలు,గొడవలు పెరిగితేనే కదా ప్రభుత్వాలు ఇరుకున పడేది?
అందుకే నేరగాళ్ళకు హ్యూమన్ యాంగిల్‌ని, ఫామిలీ యాంగిల్ ని హైలైట్ చేసి ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తాం.
మేనవ్ హెక్కులని ప్రభుత్వాలని ఇరుకున పెడతాం.
ప్రభుత్వం ఎవడిదైనా కానీ, మన మాట వినాల్సిందే!
హహ్హహ్హా! Iam the leader! Iam the dictator!