జాతీయ వస్త్రము నైటీ!
వంట చేసేటప్పుడు,
వీథిలో కూరలు కొనేటప్పుడు,
గిన్నెలు తోమేటప్పుడు,
కుళాయి దగ్గర నీళ్ళు పట్టేటప్పుడు
ఎప్పుడుబడితే అప్పుడు
అక్కరకొచ్చేదేరా నైటీ అంటే!
రోజంతా హాయిగా సౌకర్యంగా ఇట్టే వేసేసుకునే డ్రెస్సేరా నైటీ!
నడుం కనిపిస్తుందన్న బాధ లేదు,
పొట్ట కనిపిస్తుందేమోనన్న చింత లేదు,
టాప్ టూ బాటమ్ కప్పే గొప్ప వస్త్ర విశేషం రా నైటీ!
నైటీ గురించి నీకేం తెలుసురా గప్పాజీ?
మాచింగ్ జాకెట్,మాచింగ్ లంగా
మాచింగ్ ఇదీ మాచింగ్ అదీ
అన్నది ఏదీ లేకుండా
హాయిగా ఒక్క నిమిషంలో తగిలించుకునేదేరా నైటీ అంటే!
నైటీల వల్ల ఎప్పుడెప్పుడో కొన్న చీరలన్నీ
ఇప్పుడిప్పుడే కొన్నట్టు కొత్త కొత్తగా ఉంటాయిరా!
అది రా నైటీ గొప్పదనం!
పిండి రుబ్బుతూ చెయ్యి తుడుచుకున్నా,
కూరలు తరుగుతూ మరకలు అంటించుకున్నా
ఏమీ అనుకోనిదేరా నైటీ అంటే!
వెలిసి పోయినా,
చేతి గుడ్డగా,
వంటింటిలో కాలి గుడ్డగా
ఇలా రకరకాలుగా సేవలందించేదేరా నైటీ అంటే!
ఉదయాస్తమానము నైటీల్లో ఉండేవాళ్ళేరా ఆంటీలంటే!
తల్లిలాంటి నైటీలో కుటుంబం కోసం రెండుపూట్లా
వంటలు చేస్తున్న ఆ ఆంటీలను చూడరా!
వాడవాడలా ఆడవారి ప్రియమైన నైటీ ని
జాతీయ వస్త్రంగా ప్రకటించాలని ఎలుగెత్తరా!
పోటీ లేని మేటి నైటీ కోసం
చెయ్యెత్తి జై కొట్టరా తెలుగోడా!
జై నైటీ!
జై జై నైటీ!