రాముడిని ఎరుగని రాతలు!
ఏంటి రెబల్ స్టార్ పైత్యమ్మా,
ఈసారి ఏకంగా రామాయణాన్నే వక్రీకరిస్తూ పైత్యం ప్రదర్శించావ్?
పైత్యాయని, పైత్య నాయకమ్మ, పైత్యాల డ్రామారావు, వెవ్వెవ్వే వెంకోజీ తదితర మూర్ఖశిఖామణులు నీకు బాగా పైత్యం ఎక్కించినట్టున్నారే?
అయినా కోట్లాదిమంది భగవంతుడిగా కొలిచే రాముడిని, సీతను పాత్రలుగా తీసుకుని నీ ఇష్టం వచ్చినట్టు ఎందుకు రాయాలీ కథ?
అంతగా కథ రాయాలనుంటే ఆ పాత్రలకి వేరే పేర్లు పెట్టుకుని రాసుకోవచ్చుగా?
నా ఇష్టం. అది నా స్వేచ్ఛ. కొందరికి బా కోపం రావొచ్చు.
రాముడు అంటే ఒక ఉదాత్తమైన పాత్ర. ఒక ఉన్నత వ్యక్తిత్వం.
సీత అంటే ఒక ఉదాత్తమైన పాత్ర. ఒక ఉన్నత వ్యక్తిత్వం.
వాల్మీకి రామాయణంలోంచి తీసుకున్న పాత్రలకున్న ఆ వ్యక్తిత్వాలను కసాపిసా నీ ఇష్టం వచ్చినట్టు కైమా కొట్టి ఇది నా కత, నా ఇష్టం అంటే ఎలా తల్లీ?
నా ఇష్టం. అది నా స్వేచ్ఛ.
సీత పొట్టలోంచి అమ్మా! ఆకలి అంటూ రావణాసుడు అరుస్తున్నాడా?
కడుపుతో ఉన్న సీత రావణాసురుడిని నా బిడ్డ! నా బిడ్డ! అనుకుంటూ ఏడుస్తుందా? ఏమిటీ విపరీతం?
నా ఇష్టం. అది నా స్వేచ్ఛ. కొందరికి బా కోపం రావొచ్చు.
కడుపుతో ఉన్న సీత రావణాసురుడి బొమ్మ గీసి నా బిడ్డ! నా బిడ్డ! అంటే ఆ బొమ్మ చూసి రాముడు కోపంగా కాలితో తన్నాడా? పైత్యానికో హద్దుండాలి కదా పైత్యం?
నా ఇష్టం. అది నా స్వేచ్ఛ. కొందరికి బా కోపం రావొచ్చు.
సీత మహారాజుకు కాక మామూలు మనిషికి దొరికితే అవతారమనేవారా? అని నీ కతలో ప్రశ్న వేసావ్ జూనియర్ రంధ్రాన్వేషణమ్మలాగా.
భూమి మీద ధర్మ స్ధాపన కోసం, కోరిన చోట, కోరిన జన్మను తీసుకోవడాన్నే అవతారమంటారు పాపా! తెలిసిందా?
సీత జననమే ఒక పుక్కిటి పురాణమా?
పురాణాలన్నీ ఔపోశన పట్టినట్టు చెబుతున్నావేమిటి పాపా?
నా ఇష్టం. అది నా స్వేచ్ఛ.
భిన్నాభిప్రాయాలకు చోటు లేనిది రామరాజ్యం కాదని నీ కతలో ఓ స్టేట్‌మెంట్.
భిన్నాభిప్రాయమంటే రాముడిని తిట్టడం, సీతను ఏదో అనడం, కాళీ మాత సిగిరెట్ కాలుస్తున్నట్టు బొమ్మలు గీయడం, సనాతనాన్ని మాత్రమే టార్గెటెడ్‌గా తిట్టడం, ఇవి కాదు, పాపా!
రామరాజ్యం అంటే రాజుతో సహా అందరూ ధర్మం తప్పకుండా కర్తవ్య నిర్వహణ చేయడం. రాజు సైతం వ్యక్తిగత ఇష్టాఇష్టాలు పక్కన పెట్టి రాజధర్మాన్ని పాటించడం. తెలిసిందా?
సీత ఒక కళాకారిణి అని, తన గీసిన రావణాసురుడి చిత్రాన్ని బిడ్డగా భావించి possessive గా బాధ పడుతోందని రాసావ్ నీ కతలో.
సృజన చేయడంతో కళాకారుడి పని పూర్తైపోతుంది. మరో సృజనలోకి వెళ్ళిపోతాడు. అంతేగానీ తన పాత సృజలనే పట్టుకుని కూచోడు. తెలిసిందా పాపా?
రావణాసురుడి వద్దకు రాజధర్మాలు నేర్చుకు రమ్మని పంపిన వాడు రాముడు. ఆ రాముడు సీత రావణాసురుడి బొమ్మ గీయగానే కోపంతో దాన్ని తన్ని, ఆ తరువాత ఆ తప్పుకి సీతను అడవి పంపాడా?
సీతను ముక్కలు చేసి తినేస్తానని బెదిరిస్తాడు రావణుడు. ఆ రావణుడు అందగాడని సీత అనుకుంటుందా? హవ్వ!
నా ఇష్టం. అది నా స్వేచ్ఛ. కొందరికి బా కోపం రావొచ్చు.
ఏదైనా రాస్తే, అందులోనూ తరతరాలుగా ఈ దేశపు సంస్కృతిలో ఇంకిపోయిన రామాయాణాన్ని స్పూర్తిగా తీసుకుని రాస్తే, అది చదివిన పాఠకులు మానసికంగా కొంత ఎత్తుకు ఎదిగేలా ఉండాలి.
అంతే కానీ-
మనకు తెలిసిన స్కిజోఫోబియాలు,
ఆకర్షణలు,
అనుమానాలు,
అయోమయాలు,
డిప్రెషన్లు,
స్త్రీవాదాలు,
వామ పక్ష వెగటు వ్యాఖ్యలు
అన్నీ త్రేతాయుగం నాటి అవతారాలైన రాముడికి,సీతకు కల్పించి రాయడం దేశ సంస్కృతికే తీరని ద్రోహం.
తెలిసిందా పాపా?
నా ఇష్టం. అది నా స్వేచ్ఛ.నువ్వెవరు నాకు చెప్పడానికి?