నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవురా!
సెంట్రల్ కమిటీ వారి మీటింగ్ జరుగుతోంది.
వేదిక మీద జావో, మలిన్, టాలిన్ ఫొటోలతో బాటు
కోరల మార్కుడి అతి పెద్ద ఫొటో పెట్టబడి ఉంది.
సెక్రటరీ రెడ్ రావ్ పైకి లేచి-
బైనా,కష్యా ఇలా చాలా చోట్ల సంస్కృతి మీద దాడి చేసాం,విజయవంతమైయ్యాం.
ఇక్కడ కూడా అదే ప్రయత్నంలో ఉన్నాం.
ఇకనుండీ హిందూ పండుగల మీద తెలివిగా దాడి చేస్తూ వాళ్ళు ఆ పండుగలు జరుపుకోకుండా నిరుత్సాహ పరచాలని సెంట్రల్ కమిటీ నిర్ణయం.
శివ రాత్రి వస్తే అభిషేకాలకి పాలు వృధా చేస్తున్నారని సోషల్ మీడియాల్లో గొడవ చెయ్యాలి.
హోలీ వస్తే నీళ్ళు వృధా చేస్తున్నారని గొడవ చెయ్యాలి.
వినాయక చవితి వస్తే నీళ్ళని కాలుష్యం చేస్తున్నారని గొడవ చెయ్యాలి.
దీపావళి వస్తే గాలిని కాలుష్యం చేస్తున్నారని గొడవ చెయ్యాలి.
ఇలా ప్రతి పండుగకి వ్యాసాలు రాసి, ఉపన్యాసాలు ఇచ్చి, కతలు,కవితలు రాసి ఈ దేశంలో ఉన్న ఏ హిందువు ఏ పండుగ చేసుకోకుండా చెయ్యాలి.
మన ప్రభుత్వాలు ఉన్నచోట కాలుష్యమో ఏదో సాకు చెప్పి అధికారికంగా నిషేధాజ్ఞలు విధింపజేస్తాం.
మిగిలిన చోట్ల సోషల్ మీడియా ద్వారా మనవాళ్ళు
యూత్‌ని, సెక్యులర్ హిండూస్ ని మనవైపుకి తిప్పుకుంటారు.
ఓకేనా?
అని అందరి వంకా చూసాడు.
అందరూ ఈ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు.
కొంతకాలం గడిచింది.
మళ్ళీ సెంట్రల్ కమిటీ సమావేశం.
రెడ్ రావ్ ఉత్సాహంగా పైకి లేచి-
వ్యూహం సక్సెస్! గొప్ప విజయం.
కొన్ని వేల యేళ్ళుగా జరుపుకుంటున్న పండుగలను గురించి ఇప్పుడు కొత్తగా పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
అందరూ అటూ ఇటూగా విడిపోయి ఇంటర్‌నెట్ చర్చలతో నిండిపోయింది.
ఎక్కడ చూసినా సందేహాలు,సందేశాలు,ఆవేశాలు,కావే షాలు!
సక్సెస్! సక్సెస్!
అనగానే సభ్యులంతా కరతాళ ధ్వనులతో సంబరపడ్డారు.
మళ్ళీ కొంతకాలం గడిచింది.
మళ్ళీ సెంట్రల్ కమిటీ సమావేశం.
ఈసారి సభ్యులేమంత ఉత్సాహంగా లేరు.
రెడ్ రావ్ నీరసంగా పైకి లేచి-
మన నిర్ణయం ఒక చారిత్రక తప్పిదం!
ఖళ్..ఖళ్..
ఇది వరకు పండుగలెందుకు చేసుకుంటున్నరో పెద్దగా ఆలోచించని హిందూస్ ఇప్పుడు మనం చేసిన గొడవల వల్ల పుస్తకాలు తిరగేస్తున్నారు.
ఖళ్..ఖళ్..
ఏ పండుగ ఎందుకు చేసుకోవాలో అన్నీ తెలుసుకుని వచ్చి మాట్లాడుతున్నారు.
వాటి వెనుక ఉన్న సైన్సు,సోషలు,ఖగోళ శాస్త్రాలు అన్నీ వాట్సాపుల్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఖళ్..ఖళ్..
పండితులు,ప్రవచనకారులు రంగంలోకి దిగారు. పండుగల వెనుక విశేషాలన్నీ వివరంగా చెబుతున్నారు.
ఖళ్..ఖళ్..
వినాయక చవితికి మట్టి వినాయకుడి ప్రతిమలు వాడుతున్నారు.
దీపావళికి సూరేకారం దట్టించిన దేశవాళీ టపాసులు కాలుస్తున్నారు.
హోలీకి సహజ రంగులు వాడుతూ ఆ నీటిని చెట్లకి మళ్ళిస్తున్నారు. లేకపోతే తోటల్లో,పార్కుల్లో జరుపుకుంటున్నారు.
శివరాత్రి వస్తే మేమంతా పాలు కొనడం ద్వారా చిరు వ్యాపారస్తులకు లాభం చేకూరుస్తున్నామంటున్నారు.
ఖళ్..ఖళ్ ఖళ్..
ఇంకా, నాకు తెలియని విషయం, శివలింగానికి అభిషేకం చేసిన పాలు అందరికీ ప్రసాదం కింద పంచుతారంట!
హిహ్హీ, మనం గుడికెళ్ళంగా. ఆ సంగతి మనకు తెలవదు.
మన వ్యూహాలకి హిందూస్ ప్రతి వ్యూహం వేసారు.
ఓకే. నో ప్రాబ్లెం.
అయినా ఇదొక పద్మవ్యూహం.
మనం మన తప్పుడు ప్రచారాలు ఆపరాదు.
మేధో దాడి చేయడం మానరాదు.
ఓకే? ఖళ్..ఖళ్..
అంటూ ముగించాడు.
రాత్రికి భరత మాత రెడ్ రావ్ కలలోకి, అరుంధతి సినిమా అనుష్క గెటప్‌లో వచ్చి నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవురా! అని గర్జించడం,
ఆ గర్జన విని అదిరి పడ్డ రెడ్ రావ్, ఆ ఉలికిపాటు వల్ల వచ్చిన గగుర్పాటు వల్ల మంచం మీంచి ఢామ్మని కింద పడడం కొసమెరుపు.