సిగపట్ల గోత్రాల వారి కతల బడి!

 


ఒక్క పొద్దు పత్రికా కార్యాలయంలో కొత్తగా కథలు వ్రాసే వారికి వర్క్ షాప్‌ జరుగుతోంది. 

వేదిక పైన, రావణాసురుడు,నరకాసురుడు,దుశ్శాసనుడు,శకుని,తాతాచారి ఫొటోల మధ్యలో కోరల మార్కుడి పెద్ద ఫొటో పెట్టబడి ఉంది.

ప్రెముఖ కతా రచైత డాబుల డప్పేందర్‌ తన ప్రసంగం మొదలెట్టాడు. 

మీరంతా ఇప్పుడిప్పుడే సాహితీ ప్రపంచంలోకి అడుగు పెడుతున్న లేత రచైతలు. 
మీకు నాకు మల్లే బీభత్స అకాడెమీ అవార్డులు,ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల్లోను, ఇంకా ఇంగ్లీషులో రాస్తే అంతర్జాతీయ అవార్డులు తెచ్చుకునే సూపర్‌ ఐడియాలు నా దగ్గిర గోడౌన్‌ నిండా ఉన్నాయి. 

ఒక్కోటొక్కోటీ చెబుతా, రాసుకోండి! 


 మీకు తెలిసిన రామాయణ మహాభారతాలలో రాముడు,కృష్ణుడు,పాండవులు ఇలా వీళ్ళు హీరోలు. కదూ?

 మన కతల్లో reverse చేసి రాయాలి.

 రాముడు కాదు, రావణాసురుడు హీరో అని చెప్పాలి,
 కృష్ణుడు కాదు కంసుడు, నరకాసురుడు ఇలాంటి వాళ్ళు 
హీరోలని చెప్పాలి. ఓకేనా? 

లేత రచయిత రామాచారి పైకి లేచి, నా పేరే రామాచారి. రావణాసురుడు మంచి వాడని ఎలా కతలు రాయాలి సార్‌?
 అన్నాడు అయోమయంగా. 

రామాచారి అన్న పేరు పెట్టుకుని రాముడిని తిడితే మీ కతలు ఇంకా బాగా పండుతాయ్‌! మీకు చాలా పేరు వస్తుంది! 
అన్ని అవార్డులు మీవే!
Proceed! 
అన్నాడు డప్పేందర్‌ విలాసంగా. 

తరువాత తన ప్రసంగాన్ని continue చేస్తూ- 

సీత కాదు, శూర్పణఖ మంచిదని సానుభూతి పుట్టించాలి. 
అర్జునుడి కన్నా కర్ణుడు మంచి వాడని ఒప్పించాలి.
 ధర్మరాజు కన్నా దుర్యోధనుడు మంచివాడని కతలు రాసి జనాన్ని కన్‌ఫ్యూజ్‌ చెయ్యాలి. తెలిసిందా? 


( అందరూ ముక్త కంఠంతో సరేనన్నారు. లేత రచైత రామాచారికి ఒళ్ళు మండింది. కానీ, ఏమీ అనలేక ఊరుకున్నాడు.)

మన ఇస్త్రీవాదం,తాడిత వాదం,పీడిత వాదం ఇంకా మనం కనిపెట్టిన, కనిపెట్టబోయే అన్ని వాదాల కోసం రామాయణాన్ని, మహాభారతాన్ని,పురాణాలను ఇలా ఏది బడితే అది తీసుకుని, వక్రీకరించో, వంకర తిప్పో,ఇస్త్రీ చేసో, మడత పెట్టో మనం రాసే అన్నీ కతల్లోను వాడుకోవాలి. తెలిసిందా? 

( అందరూ ముక్త కంఠంతో సరేనన్నారు. లేత రచైత రామాచారికి ఒళ్ళు మండింది. కానీ, ఏమీ అనలేక ఊరుకున్నాడు.)

తాటకి, పూతన, నరకాసురుడు, హిడింబాసురుడు వీళ్ళంతా మంచి వాళ్ళని కతలు పుట్టించాలి. 

రాముడు,కృష్ణుడు మామూలు మనుషులేనన్నట్టు, ఏవో తప్పులు చేసారన్నట్టు కతలు సృష్టించాలి. సరేనా? 

మరి వేరే మతాల గురించి కూడా రాయొచ్చా సార్‌? అడిగాడు రామాచారి కోపంగా.

పొరపాటున కూడా రాయరాదు. వాళ్ళంతా మన వాళ్ళు. వాళ్ళని నిరంతరం పొగడాలి. వెనకేసుకు రావాలి. వాళ్ళ గురించి పోరాటం చెయ్యాలి. ఓకేనా? 

ఇదంతా ఎందుకు చెయ్యాలి సార్‌? ఉక్రోషంగా అడిగాడు రామాచారి.

మన టార్గెట్‌ అంతా హైందవమే. వాళ్ళ ధర్మం మీద వాళ్ళకి నమ్మకం పోయేట్టు శతవిధాలా ప్రయత్నించాలి. వాళ్ళ కులం మీద,గ్రంధాల మీద,ఆచారాల మీద,సంప్రదాయాల మీద,పండుగల మీద వాళ్ళకే అసయ్యం పుట్టేటట్టు సాహిత్యం సృష్టించాలి.

అప్పుడు వాళ్ళంతా మనలాగే మన కోరల మార్కు దేవుడి భక్తులై మనకు, మనం కొమ్ము కాసే వర్గాలకు అధికారం కట్టబెడతారు! 

నాకంతా గందరగోళంగా ఉంది సార్‌! అలాంటి కతలు రాస్తే పాఠకులు తిట్టిపోయరూ? ఎలా సార్‌?

ఆ మాటకు విరగబడి నవ్వాడు డాబుల డప్పేందర్‌. 

చూడు, రామాచారీ! Experience లేక నువ్వలా భయపడుతున్నావ్‌. ఇలాంటి వాటిల్లో మేం మాహిర్స్! అంటే ముదిరిపోయిన వాళ్ళం!


అలా మన కతలను moderate గా విమర్శించిన పాఠకుల్ని ముందు సృజన స్వేచ్ఛకు, భావ స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారని, సంకెళ్ళు వేస్తున్నారని, నోరు నొక్కుతున్నారని అంటాం. 

కొంతమంది భక్తులు తీవ్రంగా విమర్శిస్తారు. వాళ్ళని-
మత తత్వ శక్తులు, మత రాజకీయ శక్తులు, హిందూ తీవ్రవాద శక్తులు అంటాం గట్టిగా.

ఆఖరి అస్త్రంగా కేవలం కత రాస్తే ఎవరో  బెదిరించారని బాధ పడతాం. 

అంతే! అప్పటిదాకా కతను తిట్టిన పాఠకులు ఆ విషయం మర్చిపోయి,

అయ్యో! ఎవరు అలా బెదిరించారో? 
ఎవరైనా అలా చెయ్యడం తప్పే!
అయ్యో! తప్పు కదూ? 
అలా చేయరాదు! 
ఇలా రకరకాలుగా అనుకుంటూ guilt trap లో పడతారు. 

అదే హిందూ సమాజం speciality రామాచారీ! 
అదే మనకు బలం!హిహ్హీ! 
అన్నాడు డప్పేందర్‌, అర్థమైందా అన్నట్టు చూస్తూ.

అర్థమైందిరా అప్రాచ్య డప్పాసురా! 
మీ దిక్కుమాలిన అవార్డుల కోసం, ఆనక రాబోయే అధికారం కోసం
నా  ధర్మాన్ని తిట్టే కక్కుర్తి కాకాసురా! 

అని కేకలు వేస్తూ, తన లేత గుండె మండుతుండగా 
అక్కడినుండి నిష్క్రమించాడు మన లేత రచయిత రామాచారి.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

పద్యం కట్టిన వాడే పోటుగాడు

The side effects of సౌందర్య దృష్టి