The జంత్‌ ప్రేమిక్‌!

 


హలో,హలో! Welcome! రండి!రండి! 

Thank you Sir! అయ్యో,అయ్యో! మీ భుజం మీద పందికొక్కు కూచుంది సార్‌! చూసుకోండి సార్‌!!

హహహ! ఎందుకయ్యా అంత భయం?
 It’s my sweet baby, my pet లోలీ! 

ఆ! పందికొక్కు పెట్టా? 

లోలీ నా కన్న కూతురుకన్నా ఎక్కువ.  

మాటిమాటికి పందికొక్కు అనకు, నాక్కోపం వస్తుంది. 
ఆ కోపంలో ఏం చేస్తానో నాకే తెలీదు.  

లోలీ అని దానికో స్వీట్‌ నేమ్‌ ఉంది. ఆ నేమ్‌తో పిలు. 

సరే సార్‌! అలాగే పిలుస్తా. 

ఇదిగో చూడు, నా లోలీకి స్పెషల్‌ సోప్స్, స్పెషల్‌ షాంపూ, 
ఇవి లోలీ వింటర్‌ డ్రసెస్‌, 
ఇది లోలీని రోజూ వాకింగ్‌కి తీస్కెళ్ళేటప్పుడు డాగ్స్, కాట్స్
ఎటాక్‌‌ చెయ్‌కుండా స్పెషల్‌ ఐరన్‌ జాకెట్! 

ఓహో! బావుంది సార్‌! 
కుక్కల్ని పెంచుకునే వాళ్ళని చూసాను, పిల్లుల్ని పెంచుకునే వాళ్ళని చూసాను. 
మీరేంటి సార్‌, పందికొక్కును, సారీ, లోలీ గారిని పెంచుతున్నారు? 

నేను బేసిగ్గా జంతు ప్రేమికుడినయ్యా. 
జంతు ప్రేమిక సంస్థ టపటపా లో సభ్యుడిని. 

మా టపటపా తరఫున ఆ మధ్య మధ్యధరా సముద్రంలో ఉన్న పచ్చ తాబేళ్ళను బైబై సంస్థ బారినుండి కాపాడాలని పెద్ద ప్రదర్శన చేసాం. 

అందులో నేను గోచీ మాత్రమే కట్టి బోనులో కూచుని అర్థ నగ్న ప్రదర్శన చేసా. 

ఆ తర్వాత ఆ గోచీ కూడా తీసేసి కూచున్నా. 
పోలీసులొచ్చి మళ్ళీ గోచీ కట్టారు. 

ఓ! బైబై సంస్థ గుజరాత్‌లో ఉంది. పచ్చ తాబేళ్ళు ఎక్కడెక్కడో ఉంటే ఎలా సార్‌? అర్థం కాలా? 

అక్కడినించి ఇక్కడికి సమ్మర్‌ హాలిడేస్‌కి వస్తాయయ్యా. 
ఇంతకీ, మా దెబ్బకి బైబై వాళ్ళు అక్కడ ప్రాజెక్టు మానేసి వేరే రాష్ట్రానికి పోయి అక్కడ పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. 

అక్కడ పచ్చ తాబేళ్ళు లేవా సార్‌? 

లేవు. కానీ ఎర్రకోళ్ళు ఉన్నాయి. వాటి గురించి మళ్ళీ పోరాటం చేయబోతున్నాం. 

ఓహో! ఓకే సార్‌! 

సరే, నేను పిలవగానే మా ఇంటికి డిన్నర్‌కి వచ్చారు. మీకోసం చికెన్‌, మటన్‌ ఐటమ్స్ తో బాటు పచ్చ తాబేళ్ళ పచ్చడి చేయించా.

అదేంటి సార్‌!! పచ్చ తాబేళ్ళ… నాకేంటో కడుపులో తిప్పుతోంది. ఇందాకే కదా సార్‌ వాటిని కాపాడాలన్నారు?

బైబై సంస్థనుండి కాపాడాలన్నానయ్యా. 
పచ్చ తాబేళ్ళను తినడం మా ఆహార సంస్కృతి! 



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

పద్యం కట్టిన వాడే పోటుగాడు

The side effects of సౌందర్య దృష్టి