న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః

 


అదేవిటే, బొట్టు లేకుండా ఉన్నావు?

నేను బొట్టు పెట్టుకోవడం మానేసానక్కా!

మానెయ్యడమేమిటే?
 ఇంద ఈ పూలు పెట్టుకో.

నేను పూలు కూడా పెట్టుకోవడం లేదక్కా!

అయ్యో,అదేవిటీ?
 ఇంత ఈ ప్రసాదం తీసుకో.

నేను ప్రసాదాలు తినడం మానేసానక్కా!

అదేవిటే?
 పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావ్‌? 

పిచ్చి కాదక్కా. 
ఓ నెల క్రితం మతం మారా. అందుకే.

ఓ! అలా చెప్పు.
 ఎప్పటినించీ పట్టుకుందిదంతా? 

ఆ మధ్య నాకు జబ్బు చేసింది కదక్కా.
 అప్పుడెన్నో మొక్కులు మొక్కా. 

ఆ సమయంలో ఆ మతం వాళ్ళు వచ్చి
నాకోసం వాళ్ళ దేవుడిని అడిగితే..

తగ్గిపోయిందా? 

అవునక్కా. 
అందుకే మతం మారా.

కొంచెం ఆగితే మన దేవుళ్ళే పలికేవారేమో? 

ఆ tension లో అంత ఆలోచించలా అక్కా. 

మన దేవుళ్ళు హాండ్‌ ఇచ్చారని అటు జంపైయ్యావన్న మాట!

మరి పునర్జన్మని, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతావుగా?

నీ గత జన్మల పాప పుణ్యాలను బట్టి ఈ జన్మలో కష్టనష్టాలు కలుగుతాయని మన నమ్మకం. మర్చిపోయావా? 

నిజమేనక్కా. అలాగని ఊరుకోలేంగా. 

నిజమే. దేవతలను సహాయం కోసం అడగవలసిందే. 
అప్పుడైనా నీ గత జన్మ సంచితమైన కర్మల వల్ల  కలిగిన కష్టాలను
తగ్గిస్తారే గానీ పూర్తిగా తీసెయ్యరని తెలియదా? 

ఒకవేళ తీసివేసినా, దాన్ని మరో జన్మలో 
అనుభవించవలసి వస్తుందని తెలియదా? 

ఈ కర్మల చక్రంనుండి పుర్తిగా బయటపడే మార్గం 
ఆధ్యాత్మిక సాధన ఒక్కటే అని తెలియదా?

ఇంత ఆలోచించలేదక్కా!

ఎలా ఆలోచిస్తావు? 
నీ ఇంట్లో భగవద్గీత ఉందా? 

అది ఎవరో ముసలి వాళ్ళు చదివే పుస్తకమని…

బావుందే. ఈలోపల సినిమాలు అవీ చూసుకుంటూ ఇబ్బందులు వచ్చినప్పుడు మాత్రం నిస్సహాయంగా అటూఇటూ పరుగులు తీస్తున్నావన్న మాట!

దాన ధర్మాలతో, మంచి పనులతో మన పుణ్యం account balance పెంచుకుంటే మనకు అవి ముందు ముందు సుఖాలుగా రూపాంతరం చెందుతాయని చెబుతారు. మర్చిపోయావా ? 

అంత ఆలోచించే టైం ఎక్కడిదక్కా? 
నువ్వు బాగా చెబుతున్నావు. 
కొండంత ధైర్యం వస్తోంది.

సరే మరి, ఆ మతంలోంచి బయటకు రా. 

అమ్మో, బయటికి వస్తే ఆ దేవుడు కోపంతో 
శపిస్తాడని వాళ్ళు చెప్పారక్కా. 

One way అన్న మాట. 
మరి ఇటునుండి అటు పోయినప్పుడు మన దేవతలు శపిస్తారని భయం వెయ్యలేదా? 

అంటే శివుడు త్రిశూలంతో పొడుస్తాడని? 

విష్ణుమూర్తి సుదర్శన చక్రం వదులుతాడని? 


ఏమో, అదంతా ఆలోచించలేదక్కా. 

సరే, విను.

తరతరాలుగా మన తాతముత్తాతలను రక్షించిన
 కుల దేవతలు ఈ కష్టంనుండీ బయట పడేస్తారని పూర్తి విశ్వాసంతో ఉండడం,
ఒకవేళ కష్టం అనుభవించాలని రాసి ఉంటే, ఆ కష్టాన్ని తట్టుకోగల 
మనోధైర్యం వారు ఇస్తారనీ నిబ్బరంతో సాగడమే మన సనాతన జీవన విధానం. 

తెలిసిందా?

ఇంతకీ దేవుడి గదిలో విగ్రహాలను ఎక్కడ పెట్టావ్?

అన్నీ మూట కట్టి అటక మీద పారేసానక్కా. 

అయ్యయ్యో! కిందికి దింపి పూజ గదిలో పునఃప్రతిష్ట చేద్దాం పద! 



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన