మా తెల్గు థల్లి!

 


క్రౌంచ ద్వీపంలోని ఓ నగరంలో తెలుగు మహా సభ జరుగుతోంది. 


మహామహులంతా విచ్చేసారు.

మొదటి మహామహుడు లేచి, నాకు తెల్గు అంటే ప్రాణం. ఛిన్నప్డు పజ్జాలు రాషేవాడ్ని. ఆఫ్‌కోర్స్, ఇప్డు రాయ్‌డం లేదన్కోండీ. నేనిప్డు వేరే సైన్సెస్‌ స్టడీ ఛేస్తున్నా. ఇప్డు ఇక్డా మన కిడ్స్కి తెల్గు అదీ అంతా వేష్ట్. 
There is no use,you know? అంద్కని తెల్గు వడ్డు అని అంద్రికీ request ఛేస్తున్నా. Thank you. అని కూచున్నాడు.

చప్పట్లు మారుమోగాయి. 

ఎవరండీ ఈయన, రూథర్‌ ‌ఫార్డ్ తెలుగు మాట్లాడుతున్నాడు? అడిగాడు బ్రహ్మీ పక్కనున్న తెలుగు వాడిని.

ఈయన ఇక్కడ తెలుగు సాహిత్యానికి కుడి భుజం. సాహితీ రావని, చాలా పేరున్నాయన అన్నాడు తెలుగు వాడు. 

రెండో వక్త పైకి లేచి, మన్ది తెలుగు అచ్ఛీ భాషా హై. కానీ ఈ దేషంలో మన పిల్లల్కి తెల్గు వచ్చేకి లేదు హై. అంద్కని వేరే వేరే భాష్లు మనం నేర్వాలి హై. అవి తెల్గు కన్నా ఈజీ హై. కానీ పిల్లల్కి ఆ ఆ భాషాఓం మే tuition కి జరూరత్‌ హై. నమస్కార్‌. అందర్కీ షెలవ్‌. అని కూచున్నాడు.

చప్పట్లు మారుమోగాయి. 

ఎవరండీ ఈ హై హై నాయకా? అడిగాడు బ్రహ్మీ పక్కనున్న తెలుగు వాడిని. 

ఈయన ఇక్కడ తెలుగు బాద్‍షా అండీ, చానా పేరున్నాయన అన్నాడు తెలుగు వాడు. 

మూడో వక్త పైకి లేచి, మనాళ్ళు తెలుగు హీరోయిన్లని, తెలుగు డాన్సర్లని, తెలుగు బబర్‌దస్త్ జనాల్ని, తెలుగు సినిమా పాటలు పాడేవోళ్ళని, తెలుగు సినిమా బుల్‌బుల్స్ ని తెప్పించి క్రేజీగా తెలుగు సేవ చాస్తన్నారు. మనకిది చాలు. అప్పుడప్పుడూ ఆటవిడుపుగా ఉంటాది. ఇంక పిలకాయలకి తెలుగు నేర్పించేదీ అదీ వేస్టు. అసల్కి నాకే తెలుగు సరింగా రాదు. హీహీ.. అని తన జోకుకి తనే నవ్వుకుని చప్పట్లు కొట్టమని అందరినీ అదిలించి కూచున్నాడు. 

చప్పట్లు మారుమోగాయి. 

రేయ్‌, తింగరి నాయాళ్ళారా, మీరంతా తెలుగును బతికించడానికి సభలు పెడుతున్నారా లేకపోతే తెలుగు చచ్చిపోతుంటే చప్పట్లు కొట్టడానికి కూచున్నారా? అన్న గర్జన వినబడగానే అందరూ ఎవరా అని తిరిగి చూసారు. 

సశస్త్రధారిగా ఉన్న అల్లూరి సీతారామ రాజు! 

ఎవ్ర్ లోపల్కి రానిచ్చార్‌?

ఏయ్‌, ఎవ్రు నివ్? హిక్డా హేం పని?

ఎవురయ్యా నువ్వు? సిన్మా అల్లూరివా?  అంటూ వక్తలు కలగాపులగంగా నసుగుతుండగానే, 

సీతారామ రాజు వదిలిన  బాణ పరంపర వక్తల పృష్ట భాగాలను తాకడం, 
 ఈ హఠాత్‌ పరిణామానికి వారంతా హాహాకారాలు చేస్తూ కకావికలురై పరుగులు తీయడం- 
వల్ల ఆ తెలుగు సభ అక్కడితో అర్ధాంతరంగా ముగిసిపోయింది.



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన