నడమంత్రపు సిరిమంతుడు

 


నోటితో మాట్లాడుతున్నాడు,
నొసటితో నవ్వుతున్నాడు. 

ఎవరండీ ఇతను? 

😀😀

ఒకసారి “మీరు” అని మర్యాదగా మాట్లాడుతున్నాడు, 
ఒకసారి “నువ్వు” అని అమర్యాదగా మాట్లాడుతున్నాడు.

ఎవరండీ ఇతను? 

😀😀

ఒకసారి హుందాగా పెద్ద మనిషిలా ప్రవర్తిస్తున్నాడు.
ఒకసారి చిల్లరగా చీప్‌గా ప్రవర్తిస్తున్నాడు.

ఎవరండీ ఇతను? 

😀😀

ఒకసారి గౌరవం ఇస్తున్నాడు.
ఒకసారి ఛీత్కారంగా చూస్తున్నాడు.

ఎవరండీ ఇతను? 

😀😀

మాటి మాటికి తన ఉంగరాలు, 
ఉంగరాల జుట్టు సవరించుకుంటూ
ఎదుటి వారిని స్కాన్‌ చేస్తున్నాడు. 

ఎవరండీ ఇతను? 

అన్నింటికీ నవ్వేనా? అతన్ని గురించి ఇన్ని ప్రశ్నలడిగా. 
మీరు ఈ ఊరి వారేగా? వివరం చెప్పండి? 


అతనా? అతను ఈమధ్య కొత్తగా ధనవంతుడైయ్యాడులెండి. 😀


ఓ! అలా చెప్పండి. 


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన