భద్రం కర్ణేభిః శ్రుణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః

 

హలో,హలో,డాక్టర్‌!

 ఈమధ్య నాలో వయెలెన్స్ ఎక్కువైపోయి కసాక్‌ కసాక్‌మని ఏసెయ్యాలనిపిస్తోంది.
 అర్జెంటుగా ట్రీట్మెంట్‌ ఇవ్వండి డాక్టర్‌!

ఆగండాగండి. నింపాదిగా ఈ కుర్చీలో కూచోండి ముందు.

ఉదయం నుండీ మీ దినచర్య ఏమిటో చెప్పండి?

పొద్దున్నే న్యూస్‌ పేపర్లో కసాక్‌ కసాక్‌ నేర వార్తలు బ్రౌజ్‌ చేయడం నా హాబీ డాక్టర్‌! 

పొద్దున్నే నేర వార్తలేంటండీ?

అవి చదువుతుంటే కిక్కొస్తుంది డాక్టర్‌!
 చదివాక మాత్రం బీపీ వస్తోంది. 

సరే,తర్వాతేంజేస్తారు? 

తర్వాత టిఫిన్‌ చేస్తూ కసాక్‌ కసాక్‌ నేరాలు,ఘోరాలు టీవీలో చూస్తా డాక్టర్‌! 

టిఫీన్‌ చేస్తూ కూడానా? సరే, తర్వాత?

భోం చేసి నిద్ర పోతా. పొద్దున చదివినవి, చూసినవి కసాక్‌ కసాక్‌లన్నీ కలల్లోకి వస్తాయి డాక్టర్‌!

రావూ మరి? అప్పుడేంజేస్తారు?

లేచి బీపీ టాబ్లెట్ వేస్కుంటా డాక్టర్‌!

హుమ్‌.. బావుంది మీ వరస. మరి సాయంత్రాలేంజేస్తూ ఉంటారు?

సాయంకాలం సిన్మాకెళ్తా డాక్టర్‌!

ఓహో, ఎలాంటి సిన్మాలు చూస్తుంటారు?

గండ్రగొడ్డలితో అడ్డంగా నరుకుతా, తాట తీసిన మొనగాడు, తుపాకీతో వంద హత్యలు ఇలాంటి కసాక్‌ కసాక్‌ సిన్మాలు చూస్తా డాక్టర్‌! 

అవెందుకండీ మీకు?

అవి చూస్తుంటే కిక్కొస్తుంది డాక్టర్‌!
 చూసాక మాత్రం బీపీ వస్తోంది. 

ఇంటికొచ్చాక మళ్ళీ బీపీ మాత్రలు,నిద్ర మాత్రలు వేస్కుని నిద్ర పోతా.

నిద్ర మాత్రలెందుకండీ? 

 లేకపోతే కసాక్‌ కసాక్‌ కలలొచ్చేసి నిద్ర పట్టదండీ. 

ఈ కసాక్‌ వార్తలు, సిన్మాలు చూడ్డం మానెయ్యండీ? 

అవి మానేస్తే కిక్కు లేక అన్నం సహించడం లేదు డాక్టర్‌!
నిద్ర కూడా పట్టడం లేదు. 

సరే, అలవాటు పడ్డారుగా. Continue చెయ్యండి.

అదే డాక్టర్‌, అవి చూస్తుంటే నాకూ కసాక్‌ కసాక్‌ పొడ్వాలనిపిస్తోంది!

అయ్య బాబోయ్‌! ప్రమాదమే!
ఓ పని చెయ్యండి.
 పొద్దున్నే చాకు తీసుకుని కసాక్‌ కసాక్‌మని పొడిచి బ్రేక్‌ఫాస్ట్ కి పళ్ళు కోయండి. 
మధ్యాహ్నం కసాక్‌ కసాక్‌ మని పొడిచి లంచ్‌కి కూరలు కొయ్యండి. సాయంత్రం డిన్నర్‌కి డిట్టో. మీ ప్రాబ్లెం సాల్వ్డ్‌. ఓకేనా? 

ఓహ్‌! వాటె కసాక్‌‌ కసాక్‌ ఐడియా‌! థాంక్యూ డాక్టర్‌! థాంక్యూ! 





——————-

భద్రం కర్ణేభిః శ్రుణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః

 ( ఆత్మజ్ఞానార్ధమై మా చెవులతో ఎల్లవేళలా శుభమైన దానినే వినెదముగాక!  నేత్రములతో సర్వ కాల సర్వావస్థల యందు శుభప్రదమగు దానినే చూచెదము గాక !)



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన