ఆ మాట వినగానే రెండు చేతులు జేబులో పెట్టుకుని...
మీరు సన్యాసం పుచ్చుకోవడానికి కారణం? అడిగాడు
ఒక ముదురు సన్యాసి మరొక లేత సన్యాసిని.
నేను సన్యాసం పుచ్చుకోవడానికి కారణం మా ఆవిడ స్వామీ!
మా ఆవిడ ఇంటిని శుభ్రంగా ఉంచేది కాదు,
వంట సరిగ్గా చేసేది కాదు,
పెద్ద గొంతుతో అరుస్తూ మాట్లాడేది,
ఒక సరసం లేదు, చట్టుబండలు లేదు.
అందుకే విరక్తి పుట్టి సన్యాసం తీసుకున్నా.
అదే Facebook హేమ మాలిని అయితేనా?
అయినా అవన్నీ గత జన్మ జ్ఞాపకాలు. ఇప్పుడెందుకులే స్వామీ!
Facebook హేమమాలినా?
అవును స్వామీ, ఆవిడ తియ్యని గొంతుతో
పాట పాడి Facebook లో పెడుతూ ఉండేది.
దాని మొహం, అడుక్కో అపశృతి!
అంత అప్సరస పాడుతుంటే అపశృతులెక్కడ వినిపిస్తాయి స్వామీ?
అప్సరసా నా బొంద! అదంతా మేకప్పు మహత్యమయ్యా!
స్వామీ, ఆవిడ ఇంటిని అద్దంలా పెట్టుకుని Facebook లో post చేస్తూ ఉండేది.
అయ్యో నాయనా, అదంతా ఆవిడ భర్త చేస్తే
ఆవిడ అందంగా ముస్తాబై ఫొటో దిగి ఫేసుబుక్కులో పెట్టుకునేది!
అవును స్వామీ, ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు?
ఆ హేమమాలినీ భర్తను నేనేనయ్యా!