నేటి కాలపు తెలుగు మేధావి

 



మేధావి: నాది బ్రాందీ మార్గం. బేసిగ్గా నేను బ్రాందీ వాదిని. 
నేను అన్నింటిలోనూ దివ్యత్యాన్ని చూస్తా. అన్నిటినీ, అందరినీ పొగుడుతా. నాకంటూ ఒక మతం లేదు. నేను ఏ మతానికి చెందిన వాడిని కాదు.నేను విశ్వ మానవుడిని.
 టోటల్గా అన్ని  దేశాల సాహిత్యాల్ని, అన్ని సంస్కృతుల్ని బాగా కాచి వడపోసేసా.నేనే భరించలేనంత జ్ఞానం నా దగ్గర పోగుపడి ఉంది.
 ఎన్నో పుస్తకాలు రాసా. ఎన్నో సభల్లో ప్రసంగాలు చేస్తుంటా.
 ముందే చెప్పినట్టు నేను విశ్వ మానవుడిని.

ఫలానా అల్లర్లలో వేలాది మంది హిందువులు మరణించారు అంటున్నారు. 
కానీ మనం దీన్ని మతం కోణంలో చూడడం దారుణం. 
దీన్ని మనం మానవత్వ కోణంలో చూడాలి. 
చంపడానికి వచ్చిన వాడు ఏ మానసిక స్థితిలో అలా చేస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. 
ఏ పరిస్థితులు వారిని ఆ దారుణం చేయడానికి పురి కొల్పాయో మనం అధ్యయనం చేసి కారణాలు వెతకాలి. 
హంతకుల పట్ల సహానుభూతిని చూపించాలి. 
ముందే చెప్పినట్టు నాది అత్యున్నతమైన బ్రాందీ మార్గం. 

ఫలానా నేరంలో నేరస్థుడు హిందువని తెలిసింది. 
ఆ విషయం తెలియగానే నా నవనాడులూ కుంగిపోయాయి. 
ఒక హిందువుగా నేను యావత్‌ సమాజానికి క్షమాపణ చెబుతున్నా. మీరంతా కూడా సిగ్గుతో తలదించుకోవాలి. మోకాళ్ళ మీద కూచుని ప్రపంచాన్ని క్షమాపణ వేడుకోవాలి. 
ముందే చెప్పినట్టు నేను విశ్వ మానవుడిని.
అంతకు ముందే చెప్పినట్టు నాది అత్యున్నతమైన బ్రాందీ మార్గం. 

సామాన్యుడు: ఈయన విశ్వ మానవుడినని చెప్పుకుంటాడు. ఉన్నట్టుండి హిందువెలా అయ్యాడండీ?

దారిన పోయే దానయ్య: ఇలాంటి వాళ్ళని బొందు గాళ్ళంటారు సార్‌! 
ఈయన విశ్వ మానవుడేంటి సార్‌! గల్లీ మానవుడు కూడా కాదు.
ఈయన బయటికి రాగానే ఆ వీథిలో కుక్కలు మొరుగుతాయి, ఎవడో కొత్త వాడనుకుని. వెంటనే మళ్ళీ ఇంట్లో దూరి సోషల్‌ మీడియాలో రాయడం మొదలు పెడతాడు. 

ఒక పోస్టులో కృష్ణుడ్ని పొగుడుతాడు. ఒక పోస్టులో కృశ్చేవ్‌ని ఆకాశానికెత్తుతాడు. ఇంకో పోస్టులో మావో ని పొగిడి, మరో పోస్టులో మహా బలేశ్వరుడి మీద భక్తి ప్రకటిస్తాడు. గోవుని, గోర్బచేవ్ ని ఒకే పోస్టులో సమన్వయ పరచగలడు. బిర్యానీ గురించి రాస్తూ కాశీ విశ్వేశ్వరుడి ప్రస్తావన తేగలడు. శివాజీని పొగుడుతూ మొగలాయిలను ప్రస్తుతించగలడు. ఈయనకి ముషాయిరాల్లో మునీశ్వరులు కనిపిస్తారు, ఫారశీ పద్యాల్లో వేద నాదము వినిపిస్తుంది. ఈయనంత కన్ఫ్యూజుడు కాకరకాయ్‌ ఇంకోడు లేడు సార్‌! 

సామాన్యుడు: అలాగా? ఇలాంటి వాళ్ళ వల్ల ఉపయోగం ఏమిటండీ?

దారిన పోయే దానయ్య: జనాల్ని  కన్ఫ్యూజ్ చెయ్యడానికి పనికొస్తారు. మనకేం ఉపయోగం లేదు గానీ, వీళ్ళకి మాత్రం మేధావి అన్న పేరు, అవార్డులూ వచ్చి పడతాయ్‌! 

సామాన్యుడు: అయితే ఏం చెయ్యాలంటారు సార్‌!

దారిన పోయే దానయ్య: ఇలాంటి వాళ్ళు వేసే సోషల్‌ మీడియా పిడకలు మళ్ళీ వాళ్ళ మొహానికే కొట్టి పక్కకు తప్పుకు పోవడమే! 


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

పద్యం కట్టిన వాడే పోటుగాడు

The side effects of సౌందర్య దృష్టి