పంచకన్యా స్మరేన్నిత్యం మహాపాతక నాశనమ్‌

 







ఏదో కాలేజీ కుర్రాడు రాసిన బూతు పుస్తకంలా ఉంది. 
అదీ పౌరాణిక పాత్రల మీద! అపచారం! అపచారం! 
ఆ ఉల్లిపాయ గారికి బీభత్స అకాడెమీ అవార్డు ఎలా ఇచ్చారండీ? 

కమిటీ సభ్యుడు 1 : నేను ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలు రాసా. చాలా నిష్ఠాగరిష్ఠుడిని సుమండీ. ఆ రోజు నేను అనుష్ఠానంలో ఉండగా, ఉల్లిపాయ గారి గ్రంథరాజానికి  అవార్డు ఇవ్వడానికి మీరు ఒప్పుకుంటున్నట్టైతే సంతకం కావాలని మా ఆఫీసు అసిస్టెంటు కాయితం పట్టుకొచ్చాడు. ఫలానా సభ్యుడు ఆల్రెడీ సంతకం పెట్టాడని చెప్పాడు. పైగా నేనా రోజు మౌనవ్రతం కూడాను. అందుకే మాట్టాడకుండా సంతకం పెట్టేశా. ఇందులో నా తప్పేమీ లేదు సుమండీ. 

కమిటీ సభ్యుడు 2: నా దగ్గిరికి సంతకం కోసం వచ్చినప్పుడు నేను చేపల మార్కెట్టులో ఉన్నా. ఏదో ఒకటిలే ఎవరో ఒకరికి తగలెట్టాలి కదా అని సరేనన్నా. 

కమిటీ సభ్యుడు 3: నేను అనుసరించే వాడినీ, అనుగమించే వాడినే కానీ నాయకుడిని కాదండీ. మిగిలిన వాళ్ళంతా ఔనన్నాక నేను కాదని ఎలా అనగలను? అందుకని, నేనూ సరేనన్నా. 

అది కాదండీ, అడుగడుక్కీ అంగాంగ వర్ణనలు, అసభ్య, అశ్లీల చిత్రణలు! అదీ పౌరాణిక స్త్రీ పాత్రని! పురుష పాత్రలు సరే సరి. ఈ పుస్తకంలో వాళ్ళు మహా వీరులు కాదు, జితేంద్రియులూ కారు!
కామాతురులు! ఇది రాయడానికి మహా రచయితలెందుకండీ? కాలేజీ కుర్రవాడు రాయగలడు ఇంతకన్నా ఎక్కువ మసాలా. 

దీన్నుంచి పాఠకులు నేర్చుకోవాల్సింది గానీ, తెల్సుకోవాల్సిందిగానీ ఏమీ లేదు. 
బూతు రత్న, బూతు నాయక్‌, మహా బూతు శేఖర లాంటి బిరుదులకు అన్ని విధాలా అర్హమైన పుస్తకం! 

అని ఆ పాఠకుడలా వాపోతుండగానే అక్కడ వ్యాసుడు, భీముడు ప్రత్యక్షమైయ్యారు. 

ఏమిరా, నేనా పాత్రలను సృష్టించింది ప్రజలు ఆ పాత్రలను చూసి, సహనము,సౌశీల్యము, ఆత్మ గౌరవము, ఆత్మ విశ్వాసము, కర్తవ్య పాలన, కష్టాలలో చలించని ధైర్యము, శౌర్యము లాంటి గొప్ప గొప్ప లక్షణాలను అలవరచుకోవాలని.
 అవి కేవలం కల్పిత పాత్రలు కావు, ఈ భరత వర్షాన్ని పాలించిన మహారాజులు, మహా రాణులు, ఈ భరత వర్షంలో పుట్టిన మహర్షులు, మహా సాధ్వుల చరిత్రలవి. 
నా పాత్రలను నీ ఇష్టం వచ్చినట్టు భ్రష్టు పట్టిస్తావా? అని హూంకరించాడు వ్యాసుడు. 

మీరుండండీ తాతా, నేను చూస్తా అంటూ భీముడు గద పైకెత్తగానే, తెలివైన ఉల్లిపాయ గారు దొర్లుకుంటూ పారిపోయే క్రమంలో
బాప్‌ఘనిస్తాన్లో ఆలిబన్‌ తీవ్రవాదుల మధ్యలోకి పోయి పడడం, ఆ వెనుకే ఉన్న తెలివి తక్కువ కమిటీ సభ్యులకి ఆ గదా తాడనం తగిలి మూర్ఛ వచ్చి పడిపోవడం వెనువెంటనే జరిగిపోయాయి! 


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

పద్యం కట్టిన వాడే పోటుగాడు

The side effects of సౌందర్య దృష్టి