చింపేస్తే చిరగని చరిత్ర

 



డప్పు ముల్తాన్‌ ఒకానొక పండుగ రోజు పదివేల మంది బ్రాహ్మణులను చంపాడు.  ఆప్రాంతంలో నివసిస్తున్న ఆ వర్గం బ్రాహ్మణుల వంశాల వారు ఆ పండుగను ఇప్పటికీ జరుపుకోరు. తెలుసా? 

అమ్మో! అవునా? 

ఆ డప్పు ముల్తాన్‌ కత్తిని కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకున్న అపజయ ఆల్యా గారి సంపద అంతా హుళక్కి బుష్కూ అయింది. అది తెలుసా? 

ఇదంతా తెలవదండీ. మేమంతా డాబరు కొడుకు లబ్బరు, లబ్బరు కొడుకు జబ్బరు ఇవే బట్టీగొట్టి ఏదో పాసయ్యాం. 


సరే,మేము వేరే, మీరు వేరే, మాకు వేరే దేశం కావాలని అల్లర్లు జరిపితేనేనా ఆకిస్తాన్‌ ఇచ్చింది? 
మాకు వేరే దేశం వద్దు మేమంతా ఒకటే అని మళ్ళీ కలిసి పోలేదే? 
కనీసం మిత్రదేశంగానైనా ఉండలేదే? చెప్పూ?

అదంతా తెలవదండీ.
క్రిటీషోడి విబజించు-పాలించు పద్దతి ఏదైతే ఉందో, 
దానివల్లే ఇదంతా జరిగిందని బడి పుస్తకంలో రాసారండీ. 
అదే బట్టీగొట్టి ఏదో పాసయ్యాం. 
 
సరే, అంత దూరం ఒద్దుగానీ, మన దగ్గర్లో
తిరుపతిలో రంగనాయకుల మంటపానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసునా? 

లేదండీ.

ముష్కర మూకలు శ్రీరంగం దేవాలయం మీద పడి దేవాలయాన్ని ధ్వంసం చేస్తుంటే అక్కడినుండి ఆ మూర్తులను పట్టుకుని అర్చకులు  రహస్యంగా ప్రయాణించి తిరుపతికి చేరిస్తే, రంగనాయకులు కొలువు దీరిన మండపంగా అది రంగనాయక మంటపం అయింది! 


అయ్య బాబోయ్‌! అసలియ్యేవీ తెలవదండీ. 
తిర్పతికి పోయి గుండు గొట్టించుకోడం, 
చరిత్ర బట్టీగొట్టి పాసవడం ఇవే తెల్సండీ. 



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

పద్యం కట్టిన వాడే పోటుగాడు

The side effects of సౌందర్య దృష్టి