హిందీ హై!

 

మంత్రి గారు మా ఊరివాడని వచ్చాను. కేంద్ర మంత్రి కదా, హిందీలో మాట్లాడతాడుట. నాకేమో హిందీ ఒక్కముక్క రాదాయె అనుకున్నాడు ప్రేక్షకుల్లో కూచున్న సాంబయ్య.

మంత్రి గారి ప్రసంగం ప్రారంభమైంది.

సోదరోం అవుర్‌ సోదరీమణోం! 
నమస్కార్‌! 

ఏ శుభ్‌దిన్‌ ఇస్‌ ప్రాతఃకాల్‌ మే ఆప్‌ జైసీ సజ్జనోం కో మేరా భాషణ్‌ సునానా మేరా పూర్వ్ జన్మ్ కా సుకృత్‌ హై. 

ఇస్‌ కలి యుగ్‌ మే పాప్‌ జాస్తీ హై అవుర్‌ పుణ్య్ స్వల్ప్ హై. 

పుణ్య్ కీ ప్రాప్తీ కేలియే దేశ్‌భక్తీకీ ఆవశ్యకతా హై.

దేశ్‌ కీ సంపత్తీ కీ వృద్ధీ కేలియే ప్రజా కో పరిశ్రమ్‌ కర్‌నీ చాహియే.

పరిశ్రమ్‌ సే నిరుద్యోగ్‌ అత్యల్ప్ హోజాయేగీ.
 దేశ్‌ కీ అభివృద్ధీ హోజాయేగీ. 

ఆసేతు హిమాచల్‌ సుసంపన్న్ భారత్‌ కేలియే ప్రార్థనా కీజీయే. 

ప్రణామ్‌! నమస్కార్‌! 

జై హింద్‍! 

అని మంత్రి గారు ప్రసంగం ముగించగానే,

ప్రేక్షకుల్లోంచి, అంతా అర్థమైంది హై! అని అరిచాడు సాంబయ్య.



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

పద్యం కట్టిన వాడే పోటుగాడు

The side effects of సౌందర్య దృష్టి