కుంగ్‌ఫూ బామ్మ

 



బామ్మ గారూ, మీ దేవుళ్ళు రాళ్ళు రప్పలు.
 మా దేవుడే నిజమైన దేవుడు.

అలాగని దేవుడొచ్చి నీకు చెప్పాడా బాబూ? 

ఈ పుస్తకంలో రాసుందండీ. 

సరే బాబూ, చదువుకో. 
నా దగ్గరకొచ్చి ఎందుకు చెబుతున్నావు?

అందరికీ చెప్పి మార్చాలని మాకు చెప్పారండీ. 

అందర్నీ పుట్టేటప్పుడే తనని నమ్మేవాళ్ళుగా పుట్టించచ్చుగా బాబూ? 

కొందర్ని నమ్మే వాళ్ళుగా చేయడమెందుకు, 
కొందర్ని నమ్మని వాళ్ళుగా ఉంచడమెందుకు, 
వాళ్ళని మార్చమని నీలాంటి వాళ్ళని పంపడమెందుకు బాబూ?

అదంతా నాకు తెలవదండీ. మీరు మాదాంట్లోకి రావాలి. 

వస్తే ఏమౌతుంది బాబూ?

స్వర్గం వస్తుందండీ బామ్మ గారూ!

స్వర్గం నువ్వు చూసావా బాబూ?

లేదండీ, ఈ పుస్తకంలో రాసారు. 

స్వర్గం గిర్గం నాకేమీ వద్దు బాబూ, వెళ్ళిరా.

అలాక్కాదండీ, మిమ్మల్ని మార్చితే నాకు స్వర్గంలో డబల్‌ బెడ్రూం అపార్ట్మెంట్‌ వస్తుంది. 

ఎవరు చెప్పారు బాబూ?

నాకిది బోధించిన వారు చెప్పారండీ.

ఇంకా ఏం చెప్పారు బాబూ? 

మీ ఆదాయంలో నెలకింత అని మాకివ్వాలండీ, దేవుడి గురించి.

దేవుడికి మన డబ్బెందుకు బాబూ?

అదంతేనండీ. అది రూలు.

ఇదంతా నాకొద్దు బాబూ, దయ చేయి.

అది కాదండీ, మీ దేవుళ్ళను బయట పడేసి మా దేవుడిని నమ్మితే..

మర్యాదగా పోతావా? నా తడాఖా చూపించనా?

ఏమిటండీ బామ్మ గారూ,కొట్టడానికి రెడీ అవుతున్నట్టు పొజిషన్‌ తీసుకుంటున్నారు?

నీలాంటి వాళ్ళను తరమడానికి ఈమధ్య కుంగ్‌ఫూ నేర్చుకుంటున్నానురా డోంగ్రీ! 

డిష్క్యాం! డిష్క్యాం! 
డిష్క్యాం! డిష్క్యాం! 


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన