మాకు మేమే మహారాజులం part-5

 



అన్నాయ్‌‌, డగలాయిలు కూడా మన దేశాన్ని కొన్ని వందలేళ్ళు పరిపాలించారు గదా. ఆళ్ళ వంశాల చరిత్రలు చదూకుంటే తప్పేంటంట?

 ఒకడు నీ ఇంటిని ఆక్రమించాడనుకో. 
వందేళ్ళుగా ఆడి కుటుంబం వంశం అందులో ఉందనుకో. 
నువ్వు పోరాడి పోరాడి తిరిగి నీ ఇంటిని నువ్వు తెచ్చుకున్నావనుకో. 
అప్పుడు సరేలే, ఆళ్ళూ వందేళ్ళ బట్టీ ఉన్నారు గదా అని నీ ఇల్లు ఆక్రమించినోడిదీ, ఆడి కొడుకులు, మనవల ఫొటోలన్నీ పెట్టుకుని ఆళ్ళ గొప్పతనాలు పొగుడుతావా? నీ పోరాటం నీ ఇల్లు నువ్వు గెలుచుకోడం గురించి చెబుతావా? 

బాగా చెప్పావన్నాయ్‌. అసలికీ చరిత్ర అంత కావాల్సిందా అన్నాయ్‌? 

కిబెట్‌‌‌ దేశమోళ్ళు మన దేశంలో 70 యేళ్ళుగా ఉన్నారు. తరాలు మారినా తమ దేశం మర్చిపోలేదు. అవకాశం వచ్చినప్పుడల్లా బైనా మీద గొంతు విప్పుతూనే ఉన్నారు. చరిత్ర మర్చిపోతే దేశమే లేదు. 

నిజమేనన్నాయ్‌. అదొక శాశ్వితమైన గుర్తింపంటావు. అంతేగా? 

అంతేగా మరి. 
నువ్వు మతం మార్చుకో, 
సంస్కృతి మార్చుకో,
పౌరసత్వం మార్చుకో. 
అయినా నిన్ను భారతీయ మూలాలున్న వ్యక్తి అనే అంటారు!


కొంతమంది దేశ జెండాని గుడ్డ ముక్క అని, ఎందుకు సాల్యూట్‌ కొట్టాలని అడుగుతున్నారన్నాయ్‌!

దేశంలో కూచుని ఇలా బేవార్సు మాటలు మాట్టాడే వాళ్ళను కాపాడేదానికి ఇది నాదేశం, నా జెండా అని దేశం సరిహద్దుల్లో 
నిలబడి కొంతమంది ప్రాణాలిస్తన్నారు చూడు, అదే ఇక్కడ విచిత్రం!
 వీళ్ళు అంతర్గత శత్రువులు! ఇంటి దొంగలు!

అవునన్నాయ్‌. నిజిమే.
కొంతమంది అసలు ఇండియా అనేది బ్రిటీషోడు వచ్చినాక ఏర్పడింది అంటన్నారన్నాయ్‌!

మరి ఇండియా ఇదివరకు లేకపోతే ఏ ఇండియాని వెదుకుతూ వాస్కోడిగామా దగ్గిర్నుండీ విదేశీ దండులు ఇక్కడికి వచ్చాయి? 

కరక్టేనన్నాయ్‌. అంటే చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేదని..

అంగ,వంగ,కళింగ,ఆంధ్ర ఇలాంటి రాజ్యాల ప్రస్తావన ఎప్పటినుండో ప్రాచీన కాలం నుండీ ఉంది. పెళ్ళి మంత్రాల దగ్గరనుండీ మహాభారతం వరకు ఎన్నోచోట్ల. ఇవన్నీ భరత వర్షంలోని ప్రాంతాలు. ప్రస్తుతపు భారత దేశంలోని రాష్ట్రాలు. 

ఓకే,ఓకే. తెల్సిందన్నాయ్‌. 


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన