The No Identity crisis
బాబూ, నీ పేరేమిటి?
ముందు నన్ను బాబు అని పిలవకండి.
మా అమ్మానాన్నా నన్ను ఏ లింగానికీ చెందిన వ్యక్తిగా పెంచలేదు.
నేను ఎక్స్ ఎక్సా, ఎక్స్ వైయ్యా ఇంకా నిర్ణయించుకోలా.
ఏ లింగం పెట్టుకోవాలో ఇంకా ప్రయోగాలు చేస్తూనే ఉన్నా.
సరే, నీ పేరేమిటి?
నన్ను ఏ సంస్కృతికీ చెందని వాడిగా
పెంచాలనుకున్నారు మా పేరెంట్స్.
అందుకే నేను ఏ సంస్కృతికీ connect కాకుండా X అని పేరు
పెట్టారు.
సరే X, మీది ఏ దేశం?
నేను ఏ దేశానికీ చెందిన వాడిని కాదు, నేను freeman ని.
నా హద్దులు,సరిహద్దులు లేవు.
సరే X, ఏం చేస్తూ ఉంటావు నువ్వు?
కొన్నాళ్ళు ఉద్యోగం చేసా.
కానీ self-doubt, depression, anxiety, low-self confidence లాంటి సమస్యల వల్ల మారకద్రవ్యాలకు అలవాటు పడి, దానికోసం కొన్నాళ్ళు చికిత్స తీసుకుని, కొంచెం తేరుకుని counseling తీసుకుంటూ ప్రస్తుతం ఖాళీగా ఉన్నా.
అయ్యో, అలాగా. మీ తల్లిదండ్రుల పేర్లేమి X?
ఫలానా, ఫలానా.
ఇంటి పేరు?
ఫలానా.
ఇంటి పేరు మావాళ్ళదిలాగే ఉందే? మీదే కులం?
కులాలు, గిలాలు నాకు తెలీదు.
అసలు నాకు మతమే లేదు.
నన్ను ఏ మతానికీ చెందని వాడిగా పెంచారు మా తల్లిదండ్రులు.
బావుంది X. మీ తాత పేరైనా చెప్పు?
ఫలానా.
నా బంధువని అనిపిస్తోంది, పేరును బట్టి.
తాత ఏ ఊరి వాడు?
ఫలానా.
అది మా ఊరే! ఆహా! మీ తాత నాకు అన్నయ్య వరస!
మీ తల్లిదండ్రులని కలవొచ్చా?
వాళ్ళిద్దరూ ఇప్పుడు లేరు.
అలాగా పాపం. నాతోబాటు మన ఊరు రా X!
నీకు మన ఊరు చూపిస్తా.
బంధువులను పరిచయం చేస్తా.
సరే, ok.
చూడు X, ఇదే మన ఊరు. ఇదిగో ఇదే మీ పూర్వీకుల ఇల్లు.
ఇది మీ ముత్తాత కట్టించిన గుడి. వీళ్ళంతా మన బంధువులు.
రాజరాజేశ్వరీ దేవి మన కులదైవం.
మన వాళ్ళు ఇది వరకు రాజుల దగ్గర సైన్యాధికారులుగా ఉండేవారని చెబుతారు. ఆ రాజులు, రాజ్యాలు పోయాక వ్యవసాయంలో దిగారు. తరువాత కాలంలో వ్యాపారాల్లోకి, ఉద్యోగాల్లోకి వెళ్ళారు.
ఉదయాలు శుచిగా రాజరాజేశ్వరీ దేవికి దీపం పెట్టి స్తోత్రం చేస్తాం. సాయంకాలాలు గుడికి వెళ్ళి సాయం పూజకు హాజరౌతాం. సంవత్సరానికొకసారి అమ్మవారి తిరునాణ జరిపిస్తాం.
అంటే మనకంటూ ఒక జీవన విధానం ఉంది.
కొన్ని కట్టుబాట్లున్నాయి.
తెలిసిందా?
కొన్నాళ్ళు ఇక్కడే ఉండి ఇలా జీవించి చూడు.
నీకు నచ్చితే ఇక్కడే మామధ్యే ఉండిపోవచ్చు.
అలా X అక్కడే రెండేళ్ళు ఉన్నాడు.
బండి గాడిలో పడింది.
తన పేరును సూర్య ప్రకాశంగా మార్చుకుని అక్కడే తన బంధువుల అమ్మాయినే పెళ్ళి చేసుకుని వ్యవసాయం చేసుకుంటూ స్థిరపడి పోయాడు, Mr.X !