The stage show

 


యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్ఛతి 
తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహమ్ 

ఏయే భక్తుడు ఏయే రూపంలో భగవంతుడిని శ్రద్ధతో ఆరాధించాలని కోరతాడో ఆయా భక్తునికి ఆయా దేవతలయందే అచంచలమైన శ్రద్ధని నేను కలిగిస్తాను అని భగవద్గీతలో కృష్ణుడే చెప్పాడు! 
అని అరుస్తున్నాడు స్టేజీ మీద సూటు వేసుకున్న మత ప్రచారకుడు. 

ఇదేవిటండీ మన భగవద్గీతను తమ మత ప్రచారానికి వాడుకుంటున్నాడు? అడిగాడు బ్రహ్మీ అయోమయంగా. 

భగవద్గీతను ఉటంకిస్తున్నప్పుడు, 
కృష్ణుడు చెప్పింది ప్రామాణికం అని నమ్ముతున్నప్పుడు 
ఆ కృష్ణుడినే పూజించవచ్చుగా
మతమెందుకు సార్‌ మారడం? 
అన్నాడు మళ్ళీ అదే ప్రశ్నార్థక మొహంతో. 

మంచి మాట అన్నారు సార్‌! అయినా కృష్ణుడు “దేవతలుగా” గుర్తించింది శివుడు,మహా శక్తి,వాయు దేవుడు, వరుణ దేవుడు ఇలాంటి “హిందూ” దేవీ దేవతలను అన్నాడు పక్కనున్న తెలుగు వాడు.

వేదాల్లో మా దేవుడి గురించి ఈ శ్లోకంలో ఇలా చెప్పారు, చూసారా.. 

ఏమిటండీ వేదాల్లో ఏదో ఉందంటున్నాడు? 
అంటే వేదం ప్రామాణికమని, వేదంలో ఒకటి నమ్ముతుంటే మిగతాదంతా నమ్ముతున్నట్టే కదా, అలాంటప్పుడు ఇంక మతం మారడమెందుకు సార్‌? అన్నాడు బ్రహ్మీ. 

బాగా చెప్పారు. ఇంతకీ అలాంటి శ్లోకాలు వేదాల్లో ఎక్కడా లేవు.
 జనాలకి ఏం తెలుస్తుందిలే అని నోటికొచ్చిన అబద్ధాలు చెబుతున్నాడు అన్నాడు తెలుగు వాడు. 

ఇంతలో స్టేజీ మీద మత ప్రచారకుడి ముందుకు 
రకరకాల వికలాంగులు ప్రవేశ పెట్ట బడ్డారు.

“అతగాడు” ముట్టుకోగానే మాజిక్! 

కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు, 
కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు 
వచ్చేస్తున్నయ్‌! 

ఎటు చూసినా అంతా హర్షాతిరేకాలు! 

ఏమిటండీ ఈ వింత? 
ఇంక డాక్టర్లు, హాస్పిటల్సు అవసరం లేదు కదండీ 
అన్నాడు బ్రహ్మీ ముక్కున వేలేసుకుంటూ. 

అల్రెటీ ఉన్న వాటిని తెప్పించడం ఏమంత కష్టమండీ? అన్నాడు తెలుగు వాడు కన్ను కొడుతూ. 

ఇంతలో అక్కడో కొత్త గోల మొదలైంది. 

“అతగాడి” ముందు పూనకాలతో వూగిపోతూ, నేల మీద పడి పొర్లుతూ లేడీ ప్రజలు! 

వారిలో ఉన్న దెయ్యాలను అతగాడు వెలికి తియ్యడమేమిటి, 
వాళ్ళు గెంతులు వేస్తూ స్టేజీ పక్కకు వెళ్ళిపోవడమేమిటి, 
అంతా నాటకంలా సాగిపోతోంది!

ఏమిటండీ ఇంత మూర్ఖంగా ఉన్నారు ఈ జనాలు?
 ఇదంతా ఎలా నమ్ముతున్నారో? అన్నాడు బ్రహ్మీ. 

గొర్రెల మంద జనాలు అన్నాడు తెలుగు వాడు నవ్వుతూ. 

ఇంతలో అక్కడ పెద్ద గాలి, గాలితో వాన మొదలై
 “షో” అర్థంతరంగా
ఆపెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. 

వెంఠనే అతగాడు,
 “ఘాలీ ఆఘి ఫో! 
మేఘమా! సాఘి ఫో!
 ఆఘి ఫో!
 సాఘి ఫో!” అని అబ్రకదబ్రా స్టైల్లో పవర్‌ షో చేయబోతే, 

వెనకాలున్న పేద్ధ హోర్డింగు ఢామ్మని అతగాని తల మీద పడ్డాది!

మన వాయు దేవుడికి, వరుణ దేవుడికి 
ఇతగాడు కొత్త దేవుడి ప్రతినిధి అని తెలిసినట్టు లేదు! 
అన్నాడు తెలుగు వాడు బ్రహ్మీ వైపు చూసి బిగ్గరగా నవ్వుతూ. 



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

పద్యం కట్టిన వాడే పోటుగాడు

The side effects of సౌందర్య దృష్టి