రామాయణ తాళ వృక్షము - 2

 



విమర్శకుడు: రాముడు నాకు స్నానము అని దశరథుడన్నట్టు ఓ పద్యం. రాముడు స్నానమేమిటయ్యా? అర్థం పర్థం లేకుండా? 

కవి విరాట్‌ శిష్యుడు: అదంతా మా గురువు గారి కవితాఝరి. 

విమర్శకుడు: ఒకానొక చోట “దైత్యజంతువులు”
 అని వ్రాసిరి మీ గురువు గారు. 
జంతువులన్నీ దైత్యులా?
అసలు దైత్యులకి జంతువులకి పోలికేమిటి?
సాధు జంతువులు ఉన్నాయిగా ? అవన్నీ దైత్యులా?

నువ్వు మనిషివా? పశువ్వా? అనడం ఉంది. 
మానవత్వం పశుత్వం కన్నా గొప్పది అని మన భావన కనుక.
 అలాగే మనిషివా రాక్షసుడివా అన్న మాట. 
కానీ మరి  దైత్యులను జంతువులను పోల్చి ఎలా చెప్పడం? 
ఇంత గందరగోళం అవసరమా పాఠకుడికి? 

కవి విరాట్‌ శిష్యుడు: అదంతా మా గురువు గారి ఊహాశక్తి. 
మీవంటి అజ్ఞానులకు అర్థం కాదు. 

విమర్శకుడు: సరేనయ్యా. ఇది చెప్పు.

మేనక ఒక దేవకన్య. విశ్వామిత్రుడు ఒక మహర్షి. ఇక వారిరువురి శృంగార వర్ణన మీ గురువు గారి చేతిలో పడి ఏమేమో అయ్యింది. 
ఆ పాత చింతకాయ పచ్చడి వెలిగారమును అటుంచితే, మూల కథలో లేని విధంగా మీ గురువు గారి విశ్వామిత్రుడు పరమ నీచంగా పరమ అనౌచితంగా పరమ అసహ్యంగా కావ్యగౌరవానికి భంగం కలిగించేలా రసాస్వాదన అంతా విషమయం అనిపించేలా పరమ ధూర్తంగా, మేనకను, లంజియా! అంటాడు! 

ఈ మాట చదివాకా కూడా ఇంకా ఆ పుస్తకాన్ని చేత పట్టుకుంటే పంచ మహాపాతకాలు చుట్టుకుంటాయి పాఠకుడికి!

కవి విరాట్‌ శిష్యుడు: అదంతా మా గురువు గారి కవితాపటిమ. మీవంటి అరసికుల బుర్రలకు అందేది కాదు. 


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన