రామాయణ తాళ వృక్షము - 3

 



విమర్శకుడు: మీ గురువు గారి పద్యాలలో ఒక్కటైనా కుదరైన పద్యము ఉన్నదా? ఒక్కొక్క పద్యంలో నాలుగైదు “వాడు”లు, నాలుగైదు “నీవు”లు! అంతా అతుకుల బొంత యవ్వారము.

 సుబాహు మారీచులా? 
మారీచసుబాహులు కాదూ? 

“ఏడగు లోకము”లేమిటయ్యా? 
“ఏడు లోకము”లకు వచ్చిన తిప్పలా?
 రామ!రామ!  

కవివిరాట్‌ శిష్యుడు: మీ ఆక్షేపణలన్నీ ఉఫ్‌మని ఊది అవతల పారవేస్తారు మా గురువు గారు. మీలాటి విమర్శకులని సరుకు సేయరు వారు. 

విమర్శకుడు: అన్ని పాత్రలలోను కవి విరాట్‌ గారే దూరి పాత్రల మూలస్వభావాలను మార్చివేయడం! హా!రామా! 

అడుగడుగునా లౌక్యపు మాటలు, ఉపాలంభములు!

ఆఖరికి ఆ రామచంద్ర మూర్తిని కూడా వదల్లేదు.

నువ్వు నాతో అడవికి వస్తే కైకకు మూడు వరములిచ్చినట్లే అంటాడు సీతతో, లౌక్యమంతా ఒలుకబోస్తూ. రాముని పాత్రకే ఎసరు పెట్టిన కవి విరాట్టులు! 

కవివిరాట్‌ శిష్యుడు: మా గురువు గారు రామాయణాన్ని విలక్షణంగా రాసి సలక్షణంగా పేరు తెచ్చుకున్నారని మీవంటి విమర్శకులకు అసూయ.

విమర్శకుడు: అడవిలో ఉన్న సీతారామ లక్ష్మణులు “చెంబుతప్పెలలు భుజాన వేసుకొని ధనుర్బాణములు పూని” వెళ్ళారా? సూర్యవంశ రాజకుమారుల చేత వాల్మీకి కూడా చెంబులు,గరిటెలు, తప్పేలలు మోయించలేదే? ఏమిటయ్యా ఈ విపరీతము? అందం చందం లేని అక్కర లేని అయోమయ వర్ణనలు! 

కవివిరాట్‌ శిష్యుడు: అడవిలో వంట చేసుకోవడానికి చెంబులు, తప్పేలాలు,డేగిశాలు,గుంట గరిటెలు, చిల్లు గరిటెలు ఇవన్నియూ కావలెను కనుక మా గురువు గారు ఆలాగున వ్రాసినారు. 

విమర్శకుడు: బాగు. బాగు. 
                   ఇది అపభ్రంశముల గుట్ట! 
                    వికారముల కట్ట! 




ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన