రామాయణ తాళ వృక్షము - 5

 



విమర్శకుడు: రాముని వనవాసము పదమూడేళ్ళా? మహాకావ్యం వ్రాస్తున్న మహాకవి విరాట్టులు ఆమాత్రము సరి చూసుకొనవలదా? 


కవి విరాట్‌ శిష్యుడు: ఒక్కసారి వ్రాసిన తరువాత వెనుదిరిగి చూచు అలవాటు మా గురువు గారికి లేదు.

విమర్శకుడు: వనవాసం సంగతి విన్నాక మీ గురువు గారు సృజించిన సీత ఇల్లా అంటుంది-

ఈ యన్యాయము నింత చేసినను ఈ భూమీశుండు మీరేల యి
ట్లే యున్నారలు లక్ష్మణుండయిననున్‌ లేడా! భవచ్చాపశి
క్షా యోగ్యంబుగ నెల్ల ధాత్రి గెలువంగా లేరొ! యూహింప లే
దా యారీతిగ? నెట్టులోర్వగలరో! ఆశ్చర్య మేపారెడిన్‌‌!

ఇంత అన్యాయము చేసాడు గదా మీ నాయన, మీరింకా ఇల్లా ఉన్నారేమిటి? ఎందుకు ఊరుకున్నారు? మీరు కాకపోయినా లక్ష్మణుడు ఎలా ఊరుకున్నాడు? ధనుర్బాణాలు ప్రయోగించి రాజ్యాన్ని గెలుచుకోలేరా? ఆ ఊహే మీకు తట్టలేదా? ఎలా ఓర్చుకుంటున్నారు? అని అంటుంది, ఆస్తి తగాదాల్లో సై అంటే సై అంటూ భర్తలను యుద్ధాలకు ఎగదోసే గయ్యాళి భార్యల వలే! 

వాల్మీకి జానకి కాదు మనకి కనబడేది, ఈవిడ ఇంకెవరో! 

పాత్రల మూలస్వభావాన్నే మార్చిపారేస్తే ఎల్లాగయ్యా?

 కవి విరాట్‌ శిష్యుడు: మా గురువు గారు కొంత వైచిత్రి చూపారు. మీరది మరోలా అర్థం చేసుకోరాదు.

విమర్శకుడు: అడవిలో సీత కట్టిన “చీని వస్త్రములను” ముని పత్నులు చూచినారా? 
నార వస్త్రములు కదయ్యా ఆవిడ కట్టుకెళ్ళింది? 
త్రేతాయుగము నాటికే అయోధ్య రాజులు చైనా నుండి వస్త్రములను దిగుమతి చేసుకొనెడి వారా ఏమి? 

కవి విరాట్‌ శిష్యుడు: మీరు మరీ అంత రంధ్రాన్వేషణ చేయరాదు.కొన్ని చూచీ చూడనట్టుబోవలెను. 


విమర్శకుడు: హూ! సరి!సరి!


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన