చుక్కల పల్లకిలో!

 కొన్నాళ్ళు సినిమాలే చూసా.

తరువాత?

అందులో ఏమీలేదని తెలుసుకున్నా. 

కొన్నాళ్ళు అమ్మాయిల వెంట తిరిగా. 

తరువాత?

అందులో ఏమీలేదని తెలుసుకున్నా. 


కొన్నాళ్ళు సాయంకాలమైయ్యేటప్పటికి మందు కొడుతూ గడిపా. 

తరువాత?

అందులో ఏమీలేదని తెలుసుకున్నా. 

 ఏమీ లేదని తెలుసుకున్నావ్‌గా.  
అవన్నీ మానేసావా మరి?

ఎలాగూ సగం జీవితం గడిచిపోయింది కదరా, ఇంక అన్నీ మానేసి చేసేదేముందిలే అని ప్రస్తుతం సినిమాలు చూస్తూ, అమ్మాయిల వెనక తిరుగుతూ, సాయంకాలాలు మందు కొడుతూ కాలక్షేపం చేస్తున్నా. ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన