పోనిద్దురూ, మనకెందుకు?

 ఈ విమర్శలు అవీ మీకెందుకు?
 చక్కగా మీపాటికి మీరు మీకు తోచినవి రాసుకోండి.

మరి ఆ పుస్తకాలను, రచయితలను విపరీతంగా ప్రచారం చేస్తున్నారుగా?

పోనిద్దురూ, మనకెందుకు?

మరి ఆ పుస్తకాల గురించి ఆ రచయితలకు అవార్డులు వచ్చేలా పైరవీలు చేస్తున్నారుగా?

పోనిద్దురూ, మనకెందుకు?

పసలేని సాహిత్యాన్ని గొప్ప సాహిత్యంగా ప్రచారం చేస్తున్నారుగా? 

పోనిద్దురూ, మనకెందుకు?

ఆ పుస్తకాల్లోని భావాలకు, ప్రచారాలకు 
కొంతమందైనా ప్రభావితం అవుతున్నారుగా? 

పోనిద్దురూ, మనకెందుకు?

ఈ నకిలీ సాహితీవేత్తల జోరులో అసలైన,అందమైన రచనలు ప్రచారం లేక, ఏ గుర్తింపు లేక మరుగున పడిపోతున్నాయి కదా? 

పోనిద్దురూ, మనకెందుకు?

 రచనల్లోని అసంబద్ధతలను ఎత్తి చూపడం సాహిత్యం చదివే వారి,సాహిత్యాన్ని సృజించేవారి బాధ్యత కాదా?

పోనిద్దురూ, మనకెందుకు?

ఈ ప్రచార హోరులో, నానావాదాల జోరులో సద్విమర్శ లేకపోతే
సాహితీ డింభకాలు పెద్ద మనుషుల్లా సాహితీ పీఠాలెక్కి చెలరేగిపోతే
 భాషకు, సాహిత్యానికి తీరని నష్టం కదండీ? 

పోనిద్దురూ, మనకెందుకు?


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన