కృష్ణా జిల్లా కుటుంబం

 


“కృష్ణా జిల్లా కుటుంబం” అన్న సినిమా చూడడానికి థియేటరుకు వెళ్ళారు సుబ్బారావు, పాపారావు.


“గేందివయ్యా, గట్ల పరేషానవుతున్నవ్‌?” అంటోంది తల్లి పాత్ర.

“ఏందిరా, కిండల్‌ బడ్తున్నావ్‌? లత్కోర్‌?” అంటున్నాడు హీరో.

“ఏమ్‌టి నువ్‌ మాట్ లాడేద్‍? తోలు తీసి తప్పెట్‌ కేస్తా!” అంటోంది తండ్రి పాత్ర.

“ఏంటి నాంగారు, ఏటంటన్నారు మీరు? నా మాటినుకొని ఆడ్నొగ్గేయండీ” అంటోంది చెల్లి పాత్ర.

ఏంటండీ, ఒక్క పాత్రా కృష్ణా జిల్లా యాసలో మాట్టాడం లేదు? అన్నాడు సుబ్బారావు పాపారావుతో. 

ఏదో ఒకటిలెండి, కనీసం తెలుగు మాట్లాడుతున్నాయి పాత్రలన్నీ.
ఈ కుటుంబ సభ్యులంతా వివిధ జిల్లాల నుండీ, రాష్ట్రాల నుండీ వచ్చి కృష్ణా జిల్లాలో స్థిరపడ్డారు అనుకుంటే సరి, అన్నాడు పాపారావు తేలికగా. 

మరి పిల్లల పాత్రలు కూడా వేరే వేరే యాసల్లో మాట్లాడుతున్నాయి కదండీ? అన్నాడు సుబ్బారావు పాపారావు సమాధానంతో సమాధాన పడలేక. 

వారంతా వేరే వేరే జిల్లాలలోను, రాష్ట్రాల్లోను పెరుగుతూ అప్పుడప్పుడూ కృష్ణా జిల్లాకి వచ్చిపోతుంటారని అనుకుంటే సరి! 
అన్నాడు పాపారావు సినిమాలో లీనమౌతూ.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన