కోపాన్ని జయించడం ఎలా?

 



నేను ఎన్నో personality development కోర్సులు చేసి 
మొత్తానికి కోపాన్ని జయించగలిగానోయ్‌! 

మీరు చాలా great Sir!! 

Thank you. నన్ను ఎవడైనా తిట్టాడనుకో.

 ఒకటి నించీ వంద దాకా అంకెలు లెక్కబెడతా. 

Super Sir! అప్పుడు కోపం పోతుంది కదా సార్‌?

తరువాత అటూఇటూ వంద అడుగులు పచార్లు చేస్తా. 

ఓహో! అప్పుడు కోపం పోతుంది కదా సార్‌?

 తరువాత రెండు వందలసార్లు ఊపిరి నెమ్మదిగా పీల్చి వదులుతా. 

అలాగా! అప్పుడు కోపం పోతుంది కదా సార్‌?

తరువాత నాలుగు రౌండ్లు జపమాల తిప్పుతా. 

ఓ! అప్పుడు కోపం పోతుంది కదా సార్‌?

తరువాత గంటసేపు శీర్షాసనం వేస్తా. 

బావుంది Sir! అప్పుడు కోపం పూర్తిగా పోతుంది కదా సార్‌?

 తరువాత నన్ను తిట్టిన వాడి ఇంటికి వెళ్ళి కొట్టేసి వస్తా. 

అప్పుడు నా కోపమంతా ఏంటో చేత్తో తీసేసినట్టు మాయం అయిపోతుందోయ్‌!


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

పద్యం కట్టిన వాడే పోటుగాడు

The side effects of సౌందర్య దృష్టి