దేశమంటే బలాఢ్యులోయ్‌!

 



మన తెలుగు నేల మీద నేటి కాలపు యువకులు ఎలా ఉన్నారో చూద్దామని స్వర్గంనుండి దిగి వచ్చారు,

 కోడి రామ్మూర్తి గారు మరికొంత మంది మరాఠా యోధులు. 

బాబూ, వివేకానందుడు చెప్పిన 
ఇనుప కండలు, ఉక్కు నరాలు ఉన్నయ్యా నీకు? 

ఇనప కండల్? ఉక్కు నరాల్‌? 😁
నాకు కళ్ళజోడ్‌.
 లో బీపీ & హై సుగర్! 

బాబూ, మేము వంద కిలోల బండ రాతిని 
బెండు బంతిలా భుజానికెత్తి చూపే వాళ్ళం. 
నువ్వలా చెయ్యగలవా?

అమ్మో, 100 kgs? 
మీకేమైనా పిచ్చా? 😁

మా మహారాష్ట్రలో ప్రతి గ్రామంలోను హనుమాన్‌ దేవాలయం ముందు రాతి గుండ్లు ఉంటాయి. 
అవి ఎత్తగలిగిన వాడే ఉస్తాదు,బలశాలి అని అందరూ ఊళ్ళో గౌరవిస్తారు. 

రాతి గుండ్లా? 
అవేంటో? 😄

బాబూ, మేం పొద్దున్నే ముద్గర్‌లతో వ్యాయామం చేసేవాళ్ళం. 
నీకవి తెలుసా బాబూ?
 
ముద్గర్‌ హంటే?  
హెప్పుడూ వినలేదే? 😁

నేను ఏనుగును ఛాతీ మీదకెక్కించుకోగలిగే వాడిని. 
నా గురించి విన్నావా?

You mean elephant?? 😮

నేను ఊపిరి గట్టిగా వదిలి ఛాతీకి కట్టిన 
ఉక్కు సంకెళ్ళను తెంచగలిగే వాడిని. 
నా గురించి విన్నావా?

ఓరి దేవుడోయ్‌, మీరు మనుషులేనా? 😲


ప్రయత్నిస్తే నువ్వూ మాకులా కావొచ్చు.

దానికోసం ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. 
దురలవాట్లను మానెయ్యాలి.
చాలా క్రమశిక్షణ కావాలి.
వ్యాయామం క్రమం తప్పకుండా చెయ్యాలి. 
యమ నియమాలను పాటించాలి. 
ఆహార నిద్రాదుల విషయంలో ఖచ్చితమైన సూత్రాలు పాటించాలి. 
మానసిక నియంత్రణ అభ్యాసం  చెయ్యాలి. 

ఇవన్నీ చేస్తావా? 

అంటే నేనిప్పుడు smoking,drinking,late night parties అన్నీ మానెయ్యాలా? హీహీ, బలే జోక్‌! 😁




ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

పద్యం కట్టిన వాడే పోటుగాడు

The side effects of సౌందర్య దృష్టి