వెయ్యి గుళ్ళు ఒక్కసారి పేల్చితే!

 



రారారా సిన్మాలో బ్రిటీషోడి ప్రతి తుపాకీ గుండు ఇంగ్లాండు నుంచి రావాలని, అంతుకే చానా ఖరీదని సెప్పారు గదన్నాయ్‌!
 
జాగ్రత్తగా అచితూచి వాడాలని అన్నారుగదన్నాయ్‌ ఆ సిన్మాలో? 

మరి మల్లూరి మింద
వెయ్యి గుండ్లు ఎట్టా పేల్చారన్నాయ్‌?

వెయ్యంటే నిజంగా వెయ్యని కాదు తమ్మీ.
 జనానికి బాగా గట్టిగా తాకాలని  అట్టా రాత్తారు. 

అసలికి సైనికుడికి ఒక్క గుండు చాలు గదన్నాయ్‌ గురి జూసి కాల్చేదానికి?
మరి ఒక్కడి మీద వెయ్యి గుండ్లు ఒక్కసారి పేల్చితే అని ఎట్టా పాట రాత్తారన్నాయ్‌? 

వెయ్యంటే నిజంగా వెయ్యి గాదని సెప్పాగా తమ్మీ!

మరి వెయ్యి గానప్పుడు వెయ్యని ఎట్టా రాత్తారన్నాయ్‌?

జనానికి ఆవేశం,ఆక్రోశం వచ్చేదానికి అట్టా ఎక్కువ జేసి రాత్తార్రా తమ్మీ!

అయితే నిజ్జంగా ఎన్ని గుండ్లు పేల్చుంటారన్నాయ్‌?

తెల్వదురా. వెయ్యైతే అయ్యుండదు. 

మరి వెయ్యి గాప్పుడు వెయ్యని ఎట్టా రాత్తారన్నాయ్‌?

సెప్పాగదా తమ్మీ, జనానికి ఏడుపు రావాలని అట్టా రాత్తారు. 
వెయ్యంటే వెయ్యని గాదు. 
దేశం కోసం ప్రాణాలిచ్చాడు మల్లూరి. 
అది నాటుకోవాల నీలోపల. తెల్సిందా?

అవునన్నాయ్‌. ఏడుపొత్తాంది నాకిప్పుడు.
వెయ్యి గుండ్లు ఒక్కసారి ఒక మడిసి మీద పేలిత్తే
ఒళ్ళంతా జల్లెడైపోదా? 

 పొగిలి పొగిలి ఏడుపొత్తాంది. 
ప్రాణాలు తీసి దేశమాత కాళ్ళ దగ్గిర పెట్టాడన్నాయ్‌!

వెయ్యి గుళ్ళు ఒక్కసారి పేల్చితే!
వందేమాతరం!
వందే మాతరం! 😭


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన