create,trim and modify!

 




జీవితమంతా తింగిరిబింగిరిగా తయారైంది గురూజీ! 
ఏం చెయ్యాలో తోచక జింగిరిగింగిరి అయిపోతున్నా!

చాలా ఈజీ శిష్యా! 
నీ లోకాన్ని నువ్వే సృష్టించుకో!

అదెలా గురూజీ? 

నీ లోకాన్ని నీకు నచ్చిన మనుషులతో నింపుకో. 

నచ్చని మనుషుల్ని? 

  తీసెయ్‌!

నాకు నచ్చిన మనుషులు వెళ్ళిపోతే? 

ఆ గాప్‌ని వెంటనే ఇంకో నచ్చిన మనిషితో ఫిలప్‌ చెయ్యి!

నాకు నచ్చిన వాళ్ళు కొన్నాళ్ళకి మారిపోతే?

నీకు నచ్చినప్పుడు ఉన్న మనిషిని నీ లోకంలో పెట్టుకుని 
ఈ మారిపోయిన మనిషిని నీ లోకంలోంచి తోసేసెయ్‌! 

బాధాకరమైన జ్ఞాపకాలుంటాయ్‌ కదా గురూజీ? 

వాటిని నీ లోకంలోంచి చెరిపెయ్‌!

చెరిపేసి? 

అందమైన జ్ఞాపకాలతో నింపేసెయ్‌!

ప్రతి రోజూ నీ లోకాన్ని modify చేస్తూ trim చేస్తూ 
నీ లోకాన్ని నీకు నచ్చిన వాటితో నింపుకుని ఆనందంగా గడిపేసెయ్‌! 

అంతే శిష్యా, create,trim and modify as per your wish! 

ఇంకో విషయం శిష్యా, పక్క వాడి లోకం నుండి గుడ్డిగా copy paste చెయ్యకు. 

అప్పుడు నువ్వు నువ్వుగా ఉండవ్‌, 
వాడికి copy అయ్యి చివరకు paste అవుతావ్‌. తెలిసిందా? 



కొత్తగా ఉన్నా గమ్మత్తుగా ఉంది గురూజీ! 
ఈ రోజునుండీ అలాగే try చేస్తా! 



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన