The movie reviewer!

 



ఇప్పుడే పల్నాడు కారం మెదటి ఆట మొదటి 15 నిమిషాలు చూసా.

బాబు కట్టిన గళ్ళ లుంగీ అదిరిపోయింది 
కానీ బాబు ఎంట్రీలో పంచ్‌ డైలాగుల్లేవు.

 డైరెక్టర్‌గా పరాక్రమ్‌ టోటల్‌ ఫెయిల్‌! 

మిగతా updates after 15 mins - 

బాబు యాక్షన్‌ అదుర్స్ గానీ 
పరాక్రమ్‌ మాటలు సరిగ్గా రాయలా.

బాబు ఫైటింగ్‌ చింపేస్తున్నాడు గానీ 
పరాక్రమ్‌ బాబు చేత చీప్‌గా పదిమందినే కొట్టించాడు.  

మిగతా updates after 15 mins - 

బాబు డాన్సులు ఉతికేసాడు గానీ 
పరాక్రమ్‌ డైరెక్షన్‌ ఘోరం. 

సినిమా సూపర్‌ స్లో. 

రెండో హీరోయిన్‌తో బాబుకి పాటా లేదు,కట్టింగు లేదు. 
ఎందుకు పెట్టినట్టో? 

డైరెక్టర్‌గా పరాక్రమ్‌ అట్టర్‌ ఫ్లాప్‌! 

మిగతా updates after 15 mins - 

విలన్స్ అంతా లోకలే, చీప్‌గా. 
పల్నాటి కారంలో ఘాటు తక్కువ. 

బాబు లుక్స్ కేక గానీ 
పరాక్రమ్‌ డైరెక్షనే దొబ్బింది! 

‌మిగతా updates after 15 mins - 

ఇదంతా వింటున్న పక్కన కూచున్న ప్రేక్షకుడు, 
సినిమా బావుంది కదయ్యా, ఎందుకలా చెబుతున్నావ్‌? 

నాలాటి పేరు మోసిన reviewer చెబుతున్నా బావుందంటున్నావంటే నువ్వు ప్రేక్షకుడిగా టోటల్‌ ఫెయిల్‌! 

అనగానే-

ఆ సినిమా చూస్తున్న ప్రేక్షకుడు తన కుర్చీలోంచి లేచి నిలబడి, 

ఆ కుర్చీని మడత పెట్టి… 🪑



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన