నమ్మకం vs నమ్మకం

 



మా దేవుడే నిజమైన దేవుడు.

అలాగని ఎవరు చెప్పారు?

మా బాదురీ చెప్పాడు.

ఆయనకెలా తెల్సు? ఆయన చూసాడా?

ఆయన రోజూ దేవుడితో మాట్లాడతాడు.

ఆయన దేవుడితో మాట్లాడ్డం నువ్వు చూసావా?

లేదు.
 రోజూ దేవుడితో మాట్లాడతానని ఆయన చెబితే మేం నమ్ముతాం.

సరే, మీ దేవుడిని నమ్మకపోతే?

నరకం!

మరి నీ తల్లీ తండ్రీ నమ్మట్లేదుగా. వాళ్ళ పరిస్థితి ఏమిటి?

వాళ్ళకీ నరకమే!

అవున్లే, నిన్ను కని పెంచి పెద్ద చేసినందుకు వాళ్ళను నరకంలో వెయ్యాల్సిందే! 


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? -1

పద్యం కట్టిన వాడే పోటుగాడు