సంగీత సామ్రాట్‌ మొద్దు కిష్న పోకిళ్ళు - 1

 




మొద్దు కిష్నా, మొద్దు కిష్నా, తిరు చూర్ణం తుడిపేసుకున్నావే?

అదంతా బ్రామ్మినికల్‌. నేనిప్పుట్నించీ free spirited man! 

సరే,అదేంటి,టోపీ పెట్టుకుని లుంగీ కట్టుకుని ఎక్కడికి బయల్దేరావ్‌?

సంగీత కచేరీ ఇవ్వడానికి!

ఈ వేషంతోనా? ఇంతకీ ఎక్కడా కచేరీ?

రైల్వే స్టేషన్‌ మెట్ల మీద!

అదేంటీ? సంగీత సభలో కాదా?

కాదు. సంగీత సభలంటే నాకు అసయ్యం.
 బాయ్‌కాట్‌ చేసా!

ఇప్పుడు చేపల మార్కెట్‌లో, 
కూరగాయల బజారులో, 
బస్‌ స్టాండ్‌, 
రైల్వే స్టేషన్‌, 
చెత్త కుండీల పక్కన కచేరీలు చేస్తున్నా! 

ఎందుకూ అక్కడికెళ్ళి పాడ్డం? 

అక్కడ బీదా బిక్కీ, కూలీ నాలీ నా పాట విని liberate అవ్వాలి!
అదే నా ఆశయం!

ఓహో, రుద్రవీణలో చిరంజీవి టైపా? 
మరి వాళ్ళకి నీ కర్ణాటక సంగీతం ఎక్కుతుందంటావా? 
నీ ఆలాపన అయ్యేటప్పటికి అంతా నిద్ర పోతారేమో? 

అందుకే బిళహరి రాగంలో లుంగీ డాన్స్ పాటని 
త్యాగరాజు కృతి స్టైల్లో పాడతా! 

అదేంటి, అసలైన త్యాగరాజ కృతులు కదా నువ్వు నేర్చుకుంది?

అవంటే నాకు అసయ్యం.
 అవన్నీ బ్రామ్మినికల్‌, కాస్టిస్ట్, మేల్‌ డామినేటింగ్‌ ఇంకా బ్లా బ్లా బ్లా! 
అందుకే వదిలేసా!

అయితే అవింక అస్సలు పాడవా? 

పాడ్తా. 
వాటిల్లో మంచివి కొన్ని ఏరి, వాటిని సుబ్బరంగా తోమి, ఉతికి ఆరేసి పాడతా. 

లుంగీ డాన్సు ప్రయోగం కాకుండా ఇంకేం చేద్దామనుకుంటున్నావ్‌?

ఈ మద్రాసీ బ్రామ్మినికల్‌ సాంబార్‌ సంగీత అకాడెమీ వాళ్ళకి బుద్ధి వచ్చేలా -
నడుముకి కొబ్బరి మట్టలు కట్టుకుని బీచ్‌లో బెల్లీ డాన్స్ సంగీత కచేరీ, వీథుల్లో బెగ్గర్‌ బాయ్స్ తో కలిసి తోడి రాగంలో మాదా కవళం తల్లే అన్న కృతి, 
కల్యాణి రాగంలో ఇంత ముద్దుంటెయ్యమ్మో అన్న కృతి పాడడం, 
ఇంకా ఇలా ఎన్నెన్నో ప్రాజెక్టులు ఉన్నయ్‌. 


వామ్మో, నీకు సంగీతం నేర్పించింది వాళ్ళేగా? 
ఎందుకంత కసి?

నాకు నేర్పారు గానీ కూలీలకి బీదలకి సాదలకి నేర్పలేదు. 
అక్కడెక్కడో ఆకాశంలో ఉన్న ఈ కర్ణాటక సంగీతాన్ని నేలబారుకి తీసుకు రావడమే నా ఆశయం! 


ఇంతకీ నీ రైల్వే స్టేషన్‌ కచేరీకి ప్రేక్షకులెవరో?

జేబు దొంగలు, గొలుసు దొంగలు, పిల్లల్నెత్తుకు పొయేవాళ్ళు, ప్రయాణికుల సూట్‌కేసులు కాజేసే వాళ్ళు ఇలాంటి తాడిత పీడిత జనాలు! 

ఓరి నాయనోయ్‌! కచేరీ సంగతి సరే, నీ పర్సు అదీ జాగ్రత్త! 



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన