తెలుగు పాట-ప్లేటు పూరీ - 3

 



పాదం మీద పుట్టు మచ్చైతే 
తోడబుట్టిన రుణం ఎట్టా తీరుద్ది తమ్మీ?

కవి గారి అందమైన ఊహ అనుకోరాదా అన్నాయ్‌?

అది గాదు తమ్మీ. చెల్లికి ఆపదొచ్చిందనుకో,
పాదం మీద పుట్టు మచ్చ ఏమన్నా కాపాడతాదా పెడతాదా?

నిజమేనన్నాయ్‌!

జన్మలు, పునర్జన్మలు ఈ కమ్మీనిష్టులు నమ్మరు గదా. 
మరి పాదం పుట్టు మచ్చ అవ్వాలంటే ఇంకో జన్మ ఎత్తొద్దూ?

బాగా చెప్పావన్నాయ్‌! 

పాదం మీద మచ్చ అవడమంటే అన్న చెల్లి కాళ్ళు పట్టుకున్నట్టు అవదూ? 

అయినట్టే ఉందన్నాయ్‌!

అది గాదు తమ్మీ, మచ్చలు, మరకలు వల్ల చెల్లికి ఏం ఉపయోగమంటున్నా?

వదిలెయ్‌, అన్నాయ్‌! చెల్లి మీద ప్రేమతో ఏదో అన్నాడు.

ఏదో అనేదేంది తమ్మీ? అర్థం సరింగా ఉండాల గదా? 
సరేగానీ,
పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు అంత వరకూ బానే ఉంది. 

ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులా? 

పోయినోళ్ళకి తీపి గురుతులుంటయ్యా? 

నిజిమే తమ్మీ. ఎప్పుడూ ఆలోచించలా!

“ఉన్నోళ్ళకి పోయినోళ్ళు తీపి గురుతులు” అని గదా ఉండాలి? 

ఏదో రాసాడు సెంటిమెంటల్‌గా. వదిలెయ్‌, అన్నాయ్‌! 


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన