సంగీత సామ్రాట్ మొద్దు కిష్న పోకిళ్ళు - 3
మొద్దు కిష్నా, మొద్దు కిష్నా, నువ్వెందుకింత రెబెల్ అయ్యావ్?
ఈ కర్ణాటక సంగీతం అంతా బ్రామ్మిన్సే!
దాని మీదే నా తిరుగుబాటు!
నాన్ బ్రామ్మిన్స్ చానామంది ఉన్నారుగా మొద్దు కిష్నా?
పురంధర దాసు, ఏసుదాసు, బెంగుళూరు నాగరత్నమ్మ ఇలా ఎంతోమంది?
ఈ బ్రామ్మిన్ గురువులది స్వకులాభిమానం!
పైన చెప్పిన వాళ్ళందరి గురువులూ బ్రామ్మిన్సేగా మొద్దు కిష్నా?
అదంతా కాదు, కర్ణాటక సంగీతం అట్టడుగు ప్రజల్లోకి వెళ్ళకుండా కుట్ర జరిగింది!
దాని మీదే నా పోరాటం!
అదే నా ఆరాటం!
ఏ దేశంలోనైనా శాస్త్రీయ సంగీతానికి ప్రేక్షకులు తక్కువ,
పాప్ సంగీతానికి ప్రేక్షకులు చాలా చాలా ఎక్కువ కదా, మొద్దు కిష్నా?
అందుకే శాస్త్రీయ సంగీతాన్ని వేరే వేరే సంగీతాలతో కలిపి కిచిడి చేసి ప్రజల్లోకి తీస్కెళ్తున్నా!
ఆవకాయలో చికెన్ బిర్యానీ కలుపుతున్నా!
ఓహో, ఇదీ కురుడియారే చెప్పాడా?
కురిడియార్ భక్తుడ్ని అయ్యాకే రాముడిని వదిలేసి కలి పురుషుడి ఫాలోయర్ అయ్యా!
ఓహో, అప్పట్నించీ నీ నెత్తిన దెయ్యం ఆడ్డం మొదలైనట్టుంది!
దెయ్యం ఏమిటి? దెయ్యం?
ఆ తర్వాతే నాకు రోమన్ తోసేసెయ్ అవార్డు వచ్చింది, తెలుసా?
వామ్మో, ఈ అవార్డు తీస్కున్న వాళ్ళంతా ఆ తర్వాత మటాష్ అయ్యారు,జాగ్రత్తయ్యా,మొద్దు కిష్నా!