అవార్డుల ప్రహసనం!

 



లేజీ కవి భావుకశ్రీ పేరిట పెట్టిన అవార్డును ఈసారి అవధాని గారికి ఇస్తున్నామని ప్రకటిస్తున్నాం.

భావుకశ్రీ గారి భావ కవిత్వానికీ అవధానాలకీ సంబంధం ఏమిటండీ?

😁😁

మహాకవి అరుణశ్రీ పేరిట పెట్టిన అవార్డును ఈసారి ప్రవచనకర్త గారికి ఇస్తున్నామని ప్రకటిస్తున్నాం.

ఆ కమ్మీనిష్టు కవికి ప్రవచన కర్తకు సంబంధం ఏమిటండీ? 

😁😁

అది కాదండీ,  సైద్ధాంతిక పరమైన ఏకత్వం ఉండాలి కదండీ? 
పోనీ కనీసం శైలి, లేకపోతే వారి వారి సాహితీ ప్రక్రియలైనా కలవాలి కదండీ? 

😁😁

నవ్వుతారేమండీ? నేనన్నది నిజమా కాదా?


ఈ అవార్డులు ఇచ్చే వారికి బుద్ధి లేదు!
పుచ్చుకునే వారికి సిగ్గు లేదు!
అక్కడ చప్పట్లు కొట్టేవారికి బుర్ర లేదు!

ఇంతకన్నా ఏం చెప్పమంటారు? 😀

అంతేలెండి. అవునూ, తెలియక అడుగుతా,
దేశానికి, సంస్కృతికి శత్రువులుగా 
రచనలు చేసేవారికి బీభత్స అకాడెమీ అవార్డులు ఎందుకిస్తారండీ? 

ఆ అవార్డుల కోసం కవుల్ని రచైతల్ని ఎంపిక చేసే వారు కూడా ఆ బాపతు వారే కనుక! 😀

ఓహో, మళ్ళీ వీళ్ళే అప్పుడప్పుడూ ఆ అవార్డులు వాపస్‌ ఇస్తాం అని బెదిరిస్తుంటారేంటో అర్థం కాదు. అవార్డు పుచ్చుకోడమెందుకో, 
కోపాలొచ్చినప్పుడు తిరగ్గొట్టడమెందుకో?


ఆ అవార్డు ఇచ్చేటప్పుడే ఓ క్లాజ్‌ పెట్టి ఇస్తే సరి! 😀

ఏంటండీ ఆ క్లాజు? 

ఈ అవార్డును ఏ సందర్భంలోనైనా వాపస్‌ ఇస్తాం అంటే మీకు యావజ్జీవం సైబీరియా ప్రవాసం అని! 😁




ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన