నా పేరొకపరి తలవండీ!

 



మా సాహితీ వేదికకు ప్రముఖ స్త్రీవాద రచయిత్రి బెరాల్గన్‌‌ పేరు పెడుతున్నాం. 

బాబూ, నేను తెలుగులో రామాయణం వ్రాసిన మొల్లను. 
నా పేరు తలవలేదే? 

మాకు బెరాల్గన్‌ ఒక్కరే తెలుసు. 

బాబూ, నేను సుభద్రా కల్యాణం వ్రాసిన తాళ్ళపాక తిమ్మక్కను. 
నా పేరు తలవలేదే?

మాకు బెరాల్గన్‌ ఒక్కరే తెలుసు. 

బాబూ, నేను సంగీతంతోబాటు సాహిత్య రంగానికీ సేవ చేసిన బెంగుళూరు నాగరత్నమ్మను.
 నా పేరు తలవలేదేమి?

మాకు బెరాల్గన్‌ ఒక్కరే తెలుసు. 

బాబూ, ఆ బెరాల్గన్‌ గారు ఏ విధంగా గొప్ప రచయిత్రి నాయనా?
ఆవిడ రచనలు నువ్వు చదివావా?

చదవలేదు. 
ఆవిడ గొప్ప రచయిత్రి అని నాకు తెలిసిన వాళ్ళకు తెలిసిన వాళ్ళు చెప్పారు. 
అంతే కాదు, ఆవిడ బీభత్స అకాడెమీ అవార్డు గ్రహీత.


ఓహో, అలాగా. 
నన్నయ, తిక్కన,శ్రీనాథుడు వీళ్ళందరికీ ఏ అవార్డులు వచ్చాయి నాయనా?


అదంతా నాకు తెలవదు. బెరాల్గన్‌ కే నా ఓటు. 


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన