చాలదా హరినామ సౌఖ్యామృతము!

 






భక్తి అంటే గుళ్ళ చుట్టూ పొర్లు దండాలు పెట్టడం కాదమ్మా. 
అది మూర్ఖత్వం. 
గుళ్ళ చుట్టూ తిరిగితే ఆయాసం వస్తుంది. అంతకు మించి ఏమీ ఉండదు. 
అదంతా తీసి అవతల పారెయ్‌!

అదేమిటండీ, గుళ్ళకి వెళ్ళొద్దంటున్నాడీయన? 🤔

భక్తి అంటే ఓ భజనలు చేయడం కాదమ్మా. 
అది మూర్ఖత్వం. 
భజన్లు చేసి చేసి  గొంతు అరిగిపోతుంది. అంతకు మించి ఏమీ ఉండదు. 
అదంతా తీసి అవతల పారెయ్‌!

అదేమిటండీ, భజనలు చేయొద్దంటున్నాడీయన? 🤔

భక్తి అంటే పొద్దస్తమాను పూజలు చేయడం కాదమ్మా. 
అది మూర్ఖత్వం. 
పూజలు చేసి చేసి అలసట వస్తుంది. అంతకు మించి ఏమీ ఉండదు. 
అదంతా తీసి అవతల పారెయ్‌!

అదేమిటండీ, పూజలు చేయొద్దంటున్నాడీయన? 🤔

ఈయన పూర్వాశ్రమంలో కమ్యూనిష్టు లెండి. ఇప్పుడు గాలి మళ్ళి ప్రవచనాలు చెబుతున్నాడు. అందుకనే వీరి ఆధ్యాత్మికతలో కూడా విప్లవం విలసిల్లుతూ ఉంటుంది. 😀

ఓ,అదా సంగతి! అయితే మాత్రం అలా మాట్లాడ్డమేమిటండీ? 
ఇంతకీ ఈయన ఆస్తికుడేనా? 

ఆస్తికుడే. కానీ, భక్తి అంటే గుళ్ళూ గోపురాలూ తిరగడం కాదు,
ఆత్మ జ్ఞానం కోసం ప్రయత్నించాలి అని చెప్పాలని వీరి ప్రయత్నం! 😀

ఇవన్నీ చెయ్యకుండా ఎకాఎకీ ఆత్మజ్ఞానం ఎవరికి కలుగుతుందండీ, నాకు తెలియక అడుగుతాను? ముందు ఒకటో తరగతి నుండీ అన్ని తరగతులూ పాసైతే కదా PhD గురించి ఆలోచించేది? 

నిజమేనండోయ్‌! బాగా చెప్పారు! 😀

అయినా కలియుగంలో భగవంతుని చేరడానికి నవ విధ భక్తి మార్గాలు చెప్పారు కదండీ, శ్రవణం, కీర్తనం,అర్చనం,స్మరణం, పాద సేవనం, వందనం,దాస్యం,సఖ్యం,ఆత్మ నివేదనం అని తొమ్మిది సులువైన మార్గాలు! 

చక్కగా గ్రహించారండోయ్‌! చాలదా హరి నామ సౌఖ్యామృతము అన్నట్టు! 


భక్తి అంటే గణగణగణ గంటలు కొట్టెయ్యడం కాదమ్మా.. 
  …….
తీసి అవతల పారెయ్‌! 


 ఇక్కడే ఉంటే ఇంకా ఏమేమి తీసెయ్యమంటాడో? 
  పోదాం పదండి! 😀



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన