దిలీప ఇతి రాజేందుః - దిలీప The Hero!

 



వాడు మనిషి మాంచి దిట్టంగా ఉంటాడు గానీ 

పాపం చదువు అంటలేదు. 

విగ్రహ పుష్టి నైవేద్యం నష్టి కోవ అన్న మాట!

వాడు బాగా చదువుకున్నాడు గానీ 
మనిషి ఈసురోమంటూ ఉంటాడు.

ఆరోగ్యమనే మహాభాగ్యం లేని అభాగ్యుడన్న మాట! 

వాడు పెద్ద చదువులే చదివాడు గానీ 
చదువుకు తగ్గ ఉద్యోగం లేదు. 

అన్నీ ఉన్నాయి గానీ అయిదోతనం లేదని అదో సామెత. 
ఏం చేస్తాం! 

వాడు పెద్ద పెద్ద పనులు మొదలు పెడతాడుగానీ 
ఏదీ కలిసి రాదు. 

అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నమాట! 

సరే గానీ, ఇంతమంది నమూనాలను గురించి చెప్పావు కదా, 
అసలు అసలైన మనిషంటే ఎవరో దిలీప మహారాజు లక్షణాలను 
చూసి నేర్చుకోవాలయ్యా! చెబుతా విను- 

ఆకారసదృశ ప్రజ్ఞః ప్రజ్ఞాయా సదృశాగమః
ఆగమైః సదృశారంభః  ఆరంభ సదృశోదయః


అద్భుతమైన దేహబలముతో కూడిన ఆకారము కలవాడు,
 ఆ ఆకారానికి తగిన ప్రజ్ఞ కలవాడు, 
ఆ ప్రజ్ఞకు తగిన శాస్త్రపరిశ్రమ కలిగిన వాడు, 
ఆ శాస్త్రపరిశ్రమకు తగిన గొప్ప పనులు కలవాడు,
 ఆ పనులకు తగిన ఫలసిద్ధి గలవాడు అని దాని అర్థం. 

తెలిసిందా? 



బాగు!బాగు!
మా నమూనాలకు ఈ శ్లోకం వివరిస్తాను! 



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన