అభిమాని జిందాబాద్‍!

 


ఎవరండీ ఈ తొత్తు కొడుకులు? ఎవరికి జేజేలు కొట్టుకుంటూ పోతున్నారు? ట్రాఫిక్‌ ఆపేసి ఏంటండీ ఈ న్యూసెన్స్ మనకు? ఆఫీసులకు పోవాలా వద్దా? 

మాటలు మర్యాదగా రానివ్వండి. నేనూ వాళ్ళల్లో ఒకడినే. మేమంతా ఫలానా హీరో అభిమానులం. 

ఓహో, అలాగా. సారీ అండీ. అభిమాని అంటే ఎవరండీ? 

 తన అభిమానం చాటుకోవడం కోసం తనకున్న ఒక్క చొక్కా కూడా చించుకునే వాడేరా,అభిమాని అంటే!

ఓహో!

తన అభిమాన హీరోని ఒక్కసారైనా దగ్గర నుండి చూడాలని 
ఏ చెట్టో ఎక్కి కాళ్ళు విరగ్గొట్టించుకోడానికైనా, 
ఏ కరెంటు పోలో ఎక్కి షాకులు కొట్టించుకోడానికైనా సిద్ధపడేవాడేరా,అభిమాని అంటే! 

ఓహో!

తన అభిమాన హీరోకి  ఒక్కసారైనా షేక్‌హాండ్‌ ఇవ్వాలని 
పోలీసుల చేత తన్నించుకోడానికైనా రెడీ అయ్యేవాడేరా,అభిమాని అంటే!

ఓహో!

తన ఇంట్లో పాలు లేకపోయినా, తన అభిమాన హీరో కటౌట్‌కి అప్పు చేసి మరీ పాలాభిషేకం చేసేవాడేరా, అభిమాని అంటే! 

ఓహో!

చివరికి చచ్చేటప్పుడు కూడా తన అభిమాన హీరో పేరే ఉచ్చరించే వాడేరా, అభిమాని అంటే!

ఓహో, భలే బాగా చెప్పావు‌! 
కానీ చివర పాయింట్‌ గురించి ఒక్క మాట, చచ్చేటప్పుడు కూడా స్మరిస్తే మళ్ళీ జన్మలో మీ హీరో గారింట్లో ఏ కుక్కగానో పుట్టాల్సి ఉంటుందేమో బాబు!

మా హీరో ఇంట్లో కుక్కగా పుట్టి, మా హీరో చేత్తో కుక్క బిస్కట్లు తినే అదృష్టం పడితే అంతాకన్నా కావాల్సిందేముందని గంతులేసే వాడేరా అభిమాని అంటే! 

ఓహోహో! బాబూ, నీ మాటలు వింటుంటే నాకు పిచ్చి లేచేలాగా ఉంది! 
నీకో నమస్కారం! 
మీ వాళ్ళకు చెప్పి నాకు కాస్త దారి వదిలితే ఆఫీసుకు పోతా!

కుదరదు. బండి వెనక్కి తిప్పి పక్క గల్లీలోంచి పో!



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? -1

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? - 5