టప్పాచ పుత్రా!

 


పొద్దున్నే లేచాను
బాత్రూంకి వెళ్ళాను
పళ్తోముకున్నాను
నీళ్ళోసుకున్నాను

నీకెందుకు బే!
నీకెందుకు బే!


నీళ్ళోసుకోవడమేమిట్రా అంట్ల వెధవా! 
ఏంటా దిక్కుమాలిన పాట? 

దీన్ని “టాప్‌‌” అంటారు తాతయ్యా!
నేనే రాసి ట్యూన్‌ చేసా! ఈ పాట యూత్‌ లో సూపర్‌ హిట్‌!
Youtube లో 800k views వచ్ఛాయి తెల్సా?

ఏంటా జీడిపాకం సంగీతం, వెర్రిమొర్రి సాహిత్యం? 
ఉన్న చెత్త చాలక ఇదో కొత్త కొస వెర్రి?

భలే! తాతయ్యా! మంఛి ఐడియా ఇచ్చావ్‌!
ఇప్పుడే టాప్‌ చేస్తా!


నీకో వెర్రి
నాకో వెర్రి
వెర్రి లేని
లోకం ఉందా?
వెర్రీ వెర్రీ..
వెర్రీ వెర్రీ..

పాటల వెర్రీ
మాటల వెర్రీ
రాతల వెర్రీ
కోతల వెర్రీ..
వెర్రీ వెర్రీ..

పుర్రె పుర్రెకు
వెర్రీ వెర్రీ..
నీకో వెర్రీ
నాకో వెర్రీ
వెర్రీ వెర్రీ…
జానే దో
యార్‌!
….


రేయ్‌,ఆపరా, నీ కర్ణకఠోర గార్దభ సంగీతం! 

సంగీతమంటే కర్ణాటక సంగీతంలా శ్రోతల మనసుకు శాంతిని కలిగించాలి. 
జానపద సంగీతంలా మనసుకు ఉల్లాసాన్ని కలిగించాలి.
 కనీసం పాత సినిమా పాటలా  ఏదో ఒక భావోద్వేగాన్ని కలిగించాలి.
నీ పాట ఏమిట్రా నాయనా, 
వంద గరిటెలతో ఒకేసారి కడుపులో తిప్పుతున్నట్టుంది?

హేయ్‌! తాత్స్, మళ్ళీ సూపర్‌ టాప్‌ ఐడియా ఇచ్చావ్‌! 

ఏది మంచి
ఏది చెడ్డ
చెంబూ చేటా
సుబ్బ లక్ష్మి
శంకర్శాస్త్రి
నువ్వూ నేనూ
బస్సు హారన్‌
కిర్రు చెప్పు
షోడా ఉప్పు
హై ఒల్టేజ్‌
సంగీతమంతా
ఒక్టేలే..
ఒక్టేలే..
హేయ్‌, ఒక్టేలే..



రేయ్‌,రేయ్‌! ఆపరా వెర్రి గాడిదా! 
నీ సంగీతం విని సరస్వతీ దేవి కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది. 
కావాలంటే వేరే దేశం పోయి వేరే భాషలో పాడుకో. 

తెలుగు పాటను మాత్రం అలా దుడ్డు కర్రలతో కొట్టి హింసించకురా అప్రాచ్యపు పక్షి! 


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? -1

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? - 5