ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? - 6
ఏమో రా, ఎన్నెన్నో మంచి కథలు రాసా.
ఒక్క కథా అచ్చు కాలేదే అని దిగులుగా ఉంది.
దిగులు పడకురా! నీకు అన్నీ ఉన్నాయ్, ఒక్క అభ్యుదయం తప్ప. ప్రగతిశీలత కూడా మిస్సవుతున్నావ్. అంతే.
నేనున్నాగా నీకు అభ్యుదయ ఐడియాలిచ్చే పాపాల భైరవుడ్ని!
డోంట్ వర్రీ!
ముందు మనం పాతదంతా రోత అని తీర్మానించాలి! ఓకే?
ఎందుకూ?
అప్పుడే అభ్యుదయం! సరేనా?
అన్నింటినీ ప్రశ్నించాలి! ఓకే?
అన్నిటినీ అంటే అన్నిటినీ అనుకునేవ్! కొంపలు మునుగుతాయ్!
Only హిందూ ఆచారాలను ప్రశ్నించాలి. ఓకే?
సంధ్యావందనం చేసేవాడికన్నా సారాయి తాగేవాడు గొప్ప వాడని రాయాలి. ఓకే? ఇంకా..
ఆపరా రేయ్, అసలెందుకు రాయాలిరా ఇవన్నీ??
ఇవన్నీ అభ్యుదయ కథలకు ముడి సరుకులు!
అవార్డులొచ్చే కథలకు ఇదే ఆవపిండి!
నా పిండాకూడు! నువ్వూ నీ వెధవ ఐడియాలునూ!
అజ్ఞానం చేత నువ్వల్లా మాట్లాడుతున్నావని నాకు తెలుసు రా!
ఇప్పుడొక అద్భుతమైన ముడి సరుకు ఇస్తా. విను.
ఇంకో ముఖ్య విషయం, అభ్యుదయ కథల్లో ఏది చెప్పినా సున్నితంగా, నచ్చ చెప్పేలా, ఎంత కరుడు గట్టిన సంప్రదాయవాదికైనా నిజమే కదా అనిపించేలా చెప్పాలి. ఈ ఒక్క సూత్రం బాగా మెమొరీలో వేస్కో. ఓకే?
ఇప్పుడు కథలోకి వద్దాం.
మనం ప్రతి సంప్రదాయాన్ని ప్రశ్నించాలి అని చెప్పాగా.
ఇప్పుడు స్నానం చేసి మాత్రమే గుడికి వెళ్ళాలి అన్న నియమాన్ని
మన కథలో తెలివిగా ప్రశ్నించాలి. ఓకే?
రాంబాబుకి రోజూ ఇంటి పక్కనున్న గుడికి వెళ్ళే అలవాటు. ఓ రోజు మోటరు చెడిపోయి నీళ్ళు రాలేదు. అంటే స్నానానికి నీళ్ళు లేవు. అయ్యో, స్నానం చెయ్యకుండా గుడికి వెళ్ళలేనే ఎలా అని మోచేతుల మీద కన్నీటి ప్రార్థన చేస్తుంటాడు ఆంజనేయ స్వామికి. ఓకే?
మోచేతులేమిటి? ఏడవడం ఏమిటి?
మన అభ్యుదయ కథల్లో పాత్రలు రొటీన్ కి భిన్నంగా ప్రవర్తించాలి. ఓకే?
అబ్బాయిలు చీరలు కట్టుకోవాలి. అమ్మాయిలు మీసాలు పెంచాలి. సరేనా?
సరేలే, ఏడు!
ఓకే. అలా రాంబాబు బాధాతప్త హృదయంతో పరితపిస్తూ పచార్లు చేస్తుండగా, నాస్తికుడైన అతని స్నేహితుడు దినేష్, మొన్న ఎలక్షన్లలో మిగిలిపోయిన ఎర్ర జెండాలను దిండు గలీబులుగా కుట్టించుకోవడానికి అటువైపుగా వెళుతూ, రాంబాబుని చూసి సమస్య తెలుసుకుంటాడు.
ఈ స్నేహితుడే మన అభ్యుదయ కథలో కీలకం.
మన అభ్యుదయ కథల్లో అభ్యుదయ పాత్ర పాయసంలో స్పూనులాంటిది. ఆ పాత్ర సాంప్రదాయాలనే పాయసంలో పడి కొట్టుకుంటున్న అమాయక పిపీలికాలను బయటకు తెచ్చి రక్షణ భాగ్యము కల్పించి కొత్త బంగారు లోకం చూపెడుతుంది. ఓకే?
దినేష్ రాంబాబుకి జ్ఞానబోధ చేస్తూ, భక్తికి స్నానానికి సంబంధం లేదనీ,దేవుడనే వాడుంటే నువ్వు స్నానం చేసావా, ముక్కు తుడుచుకున్నావా లాంటివి అస్సలు నోటీస్ చెయ్యడని చెబుతాడు.
ఓకే?
ఇలాంటి మన అభ్యుదయ కథల్లో సాంప్రదాయాలను ప్రశ్నించడానికి పురాణాలనుండి, భక్తుల కథలనుండి, రామాయణ మహాభారతాల నుండి కొన్ని exceptional కేసుల్ని, ప్రశ్నలని అరువు తెచ్చుకుని వాటితోనే కొట్టాలి. అప్పుడందరూ డంగైపోతారు. సరేనా?
ఇప్పుడు మన కథలో, దినేష్ మాటలు విన్నాక రాంబాబు అనుకుంటాడు- అవును, భక్త అన్నప్ప స్నానం చేసాడా? ఏనుగు స్నానం చేసిందా? సాలీడు స్నానం చేసిందా? Etc etc ఇలా అనుకుంటాడు. అతనిలో అంతర్మధనం ప్రారంభమౌతుంది. ఓకే?
శివ!శివా!
గుడి అనేది ఒక ధార్మిక స్థలం. ఆధ్యాత్మిక కేంద్రం.
అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ నిర్మలంగా వస్తేనే కదరా అక్కడి వాతావరణంలోను, భగవంతుని సన్నిధిలోను ప్రతి ఒక్కరికీ శాంతి చేకూరేది, సామూహిక ఆధ్యాత్మిక శక్తి తరంగాలు ప్రవాహమై అక్కడున్న ప్రతి ఒక్కరి మనసుని ఉన్నత ఆధ్యాత్మిక స్థితికి తోడ్కొని పోయేది?
రేయ్, నీ భావాలూ బఠాణీలూ జేబులో పెట్టుకో.
నే చెప్పినట్టు కథ రాయి.
సాంప్రదాయం కన్నా భక్తి ముఖ్యం.
ఇది అభ్యుదయంలో level 1.
మతం కన్నా మనసు ముఖ్యం.
ఇది అభ్యుదయంలో level 2.
బట్ ఓన్లీ ఫర్ హిండూస్! ఓకే?
నువ్వు రాయబోయే కథ ఒక ఉద్యమానికి దారి తీయొచ్చు.
ఏమంటావ్?
ఉద్యమాలు వద్దు. ఊరగాయలు వద్దు. ఛీ,ఛీ, దరిద్రం. ఇదంతా వింటుంటే ఆ మధ్య గుడి సాంప్రదాయం మీద జరిగిన దాడి గుర్తొస్తోంది. స్వామియే శరణం అయ్యప్పా!
అవును గానీ,సాంప్రదాయం,భక్తి ; మతం,మానవత్వం వ్యతిరేక పదాలన్నట్టు చెబుతావే?
అలాగే చెప్పాలి. అదే ప్రగతి శీలత! తెలిసిందా?
సరేగానీ, మరి బడికి, ఆఫీసులకి కూడా స్నానం చేయకుండా వెళ్ళొచ్చా?
మంచి ప్రశ్న అడిగావ్. దీని మీద రాంబాబు కథనే పొడిగిద్దాం.
దినేష్ చేసిన బ్రెయిన్‌వాష్‌తో రాంబాబు కూడా ఇదే ప్రశ్న వేసుకొని ఆఫీసుకు కూడా స్నానం చెయ్యకుండా వెళ్తాడు. అలా రెండ్రోజులు చేసాక, అందరూ నోటీస్ చెయ్యడం మొదలు పెడతారు. React కావడం మొదలు పెడతారు. అప్పుడు అభ్యుదయ దినేష్ ఆవహించిన మన రాంబాబు “మై బాడీ, మై స్మెల్” అన్న హాష్‌టాగ్ తో సోషల్ మీడియా ఉద్యమం ప్రారంభిస్తాడు. ఎలా ఉంది మన ట్విస్ట్?
నా బొందలాగా ఉంది!
అగాగు, ఇంకా ఉంది. ఈ ఉద్యమం మహోధృతమై పక్క వాడి కంపుకి కర్చీఫ్ అడ్డు పెట్టుకున్న వాడిని వీడియో తీసి, సాటి మనిషి పొడ గిట్టని ఈ నాన్-మానవత్వం గాడిని చూడండి అంటూ…
ఆపెయ్, అక్కడ! చెత్తన్నర చెత్త కథలూ నువ్వూను!
అన్నట్టు మహా నాయకుడు ఆవో కూడా జీవితాంతం పళ్ళు తోంకోకుండా గడిపాడని, అదేమంటే జీబ్రా పళ్ళు తోంకుంటుందా అన్నాడని మన అభ్యుదయ దినేష్ రాంబాబుకి బ్రెయిన్‌వాష్ చేస్తే…
అపరా నాయనా, నీకు నీ ఐడియాలకీ ఓ నమస్కారం! నన్నొదిలెయ్!
మూడు సార్లు మాల వేసిన వాడిని. అయ్యప్ప భక్తుడిని. నిలువెత్తు ధనమిచ్చినా ఇలాంటి కంపు కథలు రాయను!
ఇక నువ్వు రచైతవి అయినట్టే! నీ కథలన్నీ గోవిందో గోవింద!