కవన సృష్టి

 

ఒంటరిగా 
వదిలెయ్యి
కాసేపే, కాసేపు!

ఉత్ప్రేక్షకు
ఊతమిచ్చి
జిఘృక్షకు
దాహమిచ్చి
నిటలాక్షుని
నీడలన్ని
చిత్రికతో
సానపట్టి
వచ్చేస్తా‌
నొచ్చేస్తా,

అన్వీక్షకు
అర్ఘ్యమిచ్చి
ఆపేక్షను
అభిఘరించి
అలికాక్షుని
కళలన్నీ
పూనికతో
పుటం పెట్టి 
వచ్చేస్తా‌
నొచ్చేస్తా,

వాగ్దేవికి
మొక్కులిచ్చి
మేధకు
హవిస్సులిచ్చి

భావాలకు
వాసె కట్టి 
తలపోతల
మోడి కట్టి

కవన క్రతువు
హోతనై
కవిత్వాన్ని
కావ్యాలను
గల్పికలు
నాటకాలు
కల్పనంత
అచ్చు పోసి
విరూపాక్షు
ప్రభలలో
కలిపేసీ
యజ్ఞఫలం,
వచ్చేస్తానొ
చ్చేస్తా
నొచ్చేస్తా
ను

ఒంటరిగా
వదిలెయ్యి
కాసేపే, కాసేపు!


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? -1

పద్యం కట్టిన వాడే పోటుగాడు