కల్పననలల కథ

 


నాల్గవ ప్రశ్న: మూడు వైపులా నీరుండి నాల్గవ వైపు భూభాగము ఉన్న ప్రదేశమును ఏమందురు? 

ద్వీపమా? కాదే? ద్వీపానికి అన్నివైపులా నీరుంటుందిగా? 
ద్వీపంలాంటిదే ఇంకోటేదో పదం ఉంది. గుర్తొచ్చి చావడం లేదు.

వెనక్కి తిరిగి వెంకోజీ పేపర్లోకి చూద్దును కదా, “పెనిన్సులా” అని సమాధానం వ్రాసి, 
ఎన్ని ఆంగ్ల పదాలు తెలుగులోకి రాలేదూ? అలాగే ఇది. నోర్మూస్కుని మార్కులు వెయ్యండి. అని పక్కన బ్రాకెట్లో వ్రాసి కూర్చున్నాడు.  

ఓరి వీడి తెలివి కాకులెత్తుకెళ్ళా అని తిట్టుకుని, 
అచ్చ తెలుగు కవీశ్వరుల వారి శరణుజొచ్చితిని కదా, 

తోక లంక
పుచ్ఛపు దీవి

అని వ్రాసి దర్జాగా కూచున్నాడాయన గారు!

ఇదేమి తెలుగో ఏం పాడోనని, పక్కకు తిరిగి విస్కీ స్వామి ఏం వ్రాసాడో తొంగి చూడగా, 
భూమికి attached దీవి లేకపోతే భూమికి చెట్టాపట్టాలేసుకున్న ద్వీపము. అసలు పదం ఏదో ఉన్నదనుకోండి, అదిప్పుడు నాకు గుర్తుకు రావడం లేదు. అయినా సగం రైటే రాసాను కాబట్టి ఫుల్‌ మార్కులు వేసెయ్యండి. ఓకేనా? ఇట్లు మీ సగోత్ర విస్కీ స్వామి. ♥️🌷♥️

ఈ విస్కీ స్వామిని నమ్ముకుంటే మార్కులు హుళక్కేనని 
ఇస్త్రీవాది ఏమైనా పనికొస్తుందేమోనని చూడగా, 

“రావణ లంక”.
మూడు వైపులా సముద్రం ఉండి నాలుగో వైపు వంతెన ఉందిగా, అందుకని అదే నా ఆన్సరు. నా ఇలవేల్పు రావణాసురుడు ఉండేది అక్కడే. హనుమంతుడు లంకను నాశనం చెయ్యడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. రాముడు రావణాసురుణ్ణి చంపడం గురించి మానవ హక్కుల సంఘంలో  ఫిర్యాదు చేసా. అసలు రాముడు అతని సైన్యము అంతర్జాతీయ జలాలను అనుమతి లేకుండా దాటి లంక మీదకు యుద్ధానికి ఎలా వెళ్తారని, దీని మీద విచారణ జరపాలని, ఐక్యరాజ్య సమితికి అప్పీలు చేసా…

ఇలా చేతికి దెయ్యం పట్టినట్టు వ్రాసుకుపోతోంది. 

ఈ లంఖిణి జవాబు చూడ్డం నాదే బుద్ధి తక్కువ అని తిట్టుకుని, 
ఘనత వహించిన జెప్ఫా భాయి ఏం రాసాడో చూద్దామని చూస్తే, 

పానీ-ఏ-దీవీ
లంక-ఏ-నేల

నేను గిట్లనే రాస్తా. ఏందంటే నాకు నా భాష రాదు. ఇప్‌డిప్‌డే నేర్చుకుంటున్నా. నే హిస్టరీ చదూకోలే. కానీ హిస్టరీ మింద బుక్‌ రాసి హిస్టీరియన్‌ అయ్యా. పూరా మార్క్స్ ఇవ్వకుంటే మా వీరంగంలో లొల్లి జేస్తా. సంఝే? 

ఓరి నాయనోయ్‌! అనుకుని, చివరాఖరి ప్రయత్నంగా చండ్రహింస వైపు చూడగా, అతగాడు అక్కరకు రాని చుట్టము వలే కిటికీలోంచి బయటకు చూస్తూ అందుబాటులో లేడు. సరే కానీ, మనమే ఆలోచించి చూద్దామని,చించగా, చించగా, 

పదంలో మొదటి భాగము ద్వీపమే. రెండో భాగము ఏదో అమ్మాయి పేరులా వస్తుందని లీలగా ఏడో తరగతి పాఠం గుర్తుకు రాగా, నాకు తెలిసిన ఆడ పేర్లను తగిలించి-

ద్వీప లక్ష్మీ?
ద్వీప జ్యోతి?
ద్వీప జయమాలిని?
ద్వీప కన్నాంబ?
ద్వీప కాంచన మాల?

కాదు! కాదు! ఆ..! కల్పన! Yes, ద్వీప కల్పన! 
హిప్‌!హిప్‌!హుర్రే! 

కానీ, నాలుగు వైపులా నీరుంటే “ద్వీపము” కదా? అంచేత మూడు వైపులా నీరుంటే “ద్వీపకల్పనము” అయ్యి ఉంటుంది. 
అంతేగా!అంతేగా! 

ఆహాహా, నా బుర్ర ఇంత పాదరసంలా పనిచెయ్యడం నాకే ముచ్చటేసి, నన్ను నేను మెచ్చుకుంటూ “ ద్వీప కల్పనము“ అని వ్రాసి 
కాలరు ఎరగేసి అయిదో ప్రశ్నలోనికి ప్రవేశించితిని.


(కల్పాంతము/కల్పనాంతము సశేషము)


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? -1

పద్యం కట్టిన వాడే పోటుగాడు