“దార్శనికత“!

 


అది కాదండీ, ఒక కథలో వీరుడు ఉన్నాడనుకోండీ, తన శత్రువుని లేక శత్రువుల్ని, వారి కోటలోకి ప్రవేశించి ఒంటి చేత్తో ఓడించడం వీరోచితం అవుతుంది గానీ, ఇలా పులుల్నీ, సింహాలనీ మాంసం ముక్కలు వేసి పెంచి తీసుకొచ్చి మనుషుల మీదికి వదలి చంపడం ఏమి వీరత్వమండీ? అది ఏమి కథ? సమఉజ్జీలతో కదా యుద్ధము? న్యాయం ఉండాలి కదండీ? 

అదా,అదంతే. 
ఇప్పుడు కథలు మారిపోయాయిలెండి! 

అది కాదండీ, ఆ పులులు,సింహాలు మనం చెప్పిన మాట వింటాయా? వాటి మీద హీరోకు అదుపు ఉంటుందా? అవి శత్రువుల్ని మాత్రమే తింటాయా ఏమిటి? అది ఏమి కథండీ? 

అదా,అదంతే.
 ఇప్పుడు కథలు మారిపోయాయిలెండి! 

అది కాదండీ, వీరుడంటే యుద్ధంలో ఓడించాలిగానీ ఇలా కర్టెన్లు అవీ మీద పడేసి కాల్చి చంపడమేమిటండీ? అందులో వీరత్వం ఏమిటుందంటారు? 

అదా,అదంతే.
 ఇప్పుడు కథలు మారిపోయాయిలెండి! 


అది కాదండీ, సినిమా చివరికి చెడ్డ పాత్రల్లో పరివర్తన రావాలి కదండీ? ఇలా అడ్డదిడ్డంగా నరుక్కుంటూ పోవడమేమిటండీ? 

అదా,అదంతే.
 ఇప్పుడు కథలు మారిపోయాయిలెండి! 


అది కాదండీ, ఎంత పాపం చేస్తే ఒకసారి మనిషి జన్మ ఎత్తిన వాడు మళ్ళీ జన్మలో ఈగ అవుతాడు? అలా ఈగ అయిన వాడు హీరో ఎలా అవుతాడు? ఏదో విలన్‌ ఈగ అయ్యాడంటే అర్థం చేసుకోవచ్చుగానీ.

అదా,అదంతే.
 ఇప్పుడు కథలు మారిపోయాయిలెండి! 

అది కాదండీ, ఏదో పగ తీర్చుకుని పోయాడు,ఓకే. మళ్ళీ ఆ తర్వాతీ జన్మ కూడా మళ్ళీ ఈగగా పుట్టి హీరోయిన్ని చేరుకోవడం ఏమిటండీ? ఇంకో ఈగని చూసుకోకుండా? ఆవిడ ఇంకెవర్నీ పెళ్ళి చేసుకోకుండా ఈ ఈగతోనే ఉండిపోవాలా? 

మీరెన్ని చెప్పినా అదంతేనండీ! 
ఇప్పుడు కథలు మారిపోయాయి! 😁

ఏమిటో మారిపోవడం! నాకెందుకొచ్చిన గొడవ? ఆ మాయాబజారు, ఆ పాండవ వనవాసం ఆ పాత సినిమాలే చూస్తా, ప్రశాంతంగా! వస్తా!


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? -1

పద్యం కట్టిన వాడే పోటుగాడు